Fake baba | RangaReddy | Attack

Villagers attack on fake baba in rangareddy dist

Baba, Fake baba, RangaReddy, Fake baba in RangaReddy dist, Attack on Fake Baba

Villagers attack on fake baba in Rangareddy dist. RangaReddy dist Bantwar mandal thormamidi village people attacked a fake baba who tried to rape a devotee.

ITEMVIDEOS: ఆ బాబా బాక్స్ బద్దలైంది.. పరిగెత్తించి కొట్టారు

Posted: 08/03/2015 12:54 PM IST
Villagers attack on fake baba in rangareddy dist

బాబాలందు బురిడీ బాబాలు వేరయా అంటూ రోజుకో  వార్త వస్తున్నా కానీ దొంగ బాబాజీలు వస్తూనే ఉన్నారు. రిస్క్ లేని వ్యాపారంలా మారిన బాబాగిరిన చాలా మందే ఫాలోఅవుతున్నారు. బాబాలంటే నమ్మకం ఉన్న వారి సంఖ్య గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దొంగబాబాజీలు ఉంటారు జాగ్తత్త.. మీ సొమ్ములు ఎగ్గొట్టి మీకు పంగనామాలు పెడతారు అని మీడియాలో ఎన్ని కథనాలు వస్తున్నా కానీ చాలా మంది భక్తులు మారడం లేదు. అయితే తాజాగా అలాంటి బాబా గారి బాగోతం ఒకటి బయట పడింది. తన వద్దకు వచ్చిన ఓ భక్తురాలి మీద బాబాగారు కామంతో కాటేయబోయారు.. అంతే విషయం తెలుసుకున్న గ్రామస్తులు బాబాగారిని రోడ్ల వెంబడి పరిగెత్తించి మరీ ఉతికేశారు.

రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం తొర్మామిడిలో ఓ మహిళపై దొంగబాబా అత్యాచారయత్నం చేశాడు.దీంతో దొంగబాబాపై గ్రామస్థులు దాడి చేసి ఆయన్ను చితకబాదారు.మర్పల్లి మండలం కల్కోడ గ్రామానికి చెందిన జంగమ్మ అనే మహిళ తన భర్త ఆచూకీ కోసం ఆదివారం రాత్రి స్వామిజీ వద్దకు వెళ్లగా ఆయన అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె కేకలు వేసింది. ఈ విషయం ఉదయం గ్రామస్థులందరికీ తెలియడంతో గ్రామస్థులు స్వామిజీకి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కాగా నకిలీ స్వామిజీ కర్ణాటక రాష్ట్రంలోని బస్వకళ్యాణ్‌ నుంచి ఇక్కడికి వచ్చాడని స్థానికులు చెప్పారు. స్వామిజీ పేరు ఎండీ రహీమ్‌ అని ఆయన తమ గ్రామానికి వచ్చి ఐదు నెలలైందని చెప్పారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baba  Fake baba  RangaReddy  Fake baba in RangaReddy dist  Attack on Fake Baba  

Other Articles