AAP | Central govt | Najeeb Jung | Kejriwal | Modi, Posters, Swathi

Aap government targets pm modi with new poster in delhi

AAP, Central govt, Najeeb Jung, Kejriwal, Modi, Posters, Swathi

AAP government targets PM Modi with new poster in Delhi. In a direct AAP government targets PM Modi with new poster in Delhi. In a direct attack on the Centre, the AAP-led Delhi government has put up posters across the national capital requesting Prime Minister Narendra Modi to allow the city dispensation to work. on the Centre, the AAP-led Delhi government has put up posters across the national capital requesting Prime Minister Narendra Modi to allow the city dispensation to work.

కేంద్రం, దిల్లీ ప్రభుత్వం గొడవ గోడలకెక్కింది

Posted: 07/24/2015 03:45 PM IST
Aap government targets pm modi with new poster in delhi

దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం, ఆప్ సర్కార్ మధ్య మాటల యుద్ధం గోడలకు ఎక్కింది. గోడలకు ఎక్కడం ఏంటి అని కన్ ఫ్యూజ్ కాకండి. ‘ప్రధాన మంత్రి సర్.. మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి. ఢిల్లీ ప్రభుత్వం సరిగానే పనిచేస్తోంది’ అంటూ ఢిల్లీ రాష్ట్ర పాలక పక్షం ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ వ్యాప్తంగా కొత్తగా పోస్టర్లు వేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తో ఇప్పటికే వివాదాలతో మునిగి తేలుతున్న ఆప్ ప్రభుత్వం ఇప్పుడు నేరుగా ప్రధానినే గురిపెట్టింది. అవినీతి నిరోధక శాఖ, ఢిల్లీ మహిళా కమిషన్ వ్యవహారాల్లో కేంద్రం జోక్యాన్ని ప్రస్తావిస్తూ ‘ప్రధాని మోదీజీ.. దయచేసి ఢిల్లీ ప్రభుత్వాన్ని తన పని తనను చేయనివ్వండి’ అంటూ ఆ పోస్టర్లలో విజ్ఞప్తి చేసింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అంటే తానే అని గవర్నర్ నజీబ్ జంగ్ అనడాన్ని కేజ్రీవాల్ ఆక్షేపించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వైఖరి హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి గవర్నర్ వైఖరి హాస్యాస్పదం అంటూ సీఎం కేజ్రీవాల్ ఘాటు పదాలతో ఓ లేఖ రాశారు.

ఢిల్లీ మహిళా కమిషన్ చైర్-పర్సన్-గా స్వాతి మలివాల్ ను కేజ్రీవాల్ నియమించడం చెల్లదంటూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రకటించారు. స్వాతి మలివాల్ నియామకాన్ని ఆమోదించాలంటూ ఫైలును ఢిల్లీ సర్కార్ లెఫ్టినెంట్ గవర్నర్ కు  పంపించింది. ఆ తరువాత సీఎం కేజ్రీవాల్ గవర్నర్ కు లేఖ రాశారు. ఈ అంశంపై వివాదం రేగడానికి ఈగో సమస్య మాత్రమే కాదని, ప్రధాని నరేంద్ర మోదీ తరఫున లెఫ్టినెంట్ గవర్నర్ ఇలా వ్యవహరించడమే కారణమని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వం తనకు లొంగి ఉండాలని లెఫ్టినెంట్ గవర్నర్ కోరుకుంటున్నారని కేజ్రీవాల్ అన్నారు. ‘ఇదెలా సాధ్యం’ అని ఆయన నిలదీశారు. ఢిల్లీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఉంది. తానే ప్రభుత్వం అని ఒక వ్యక్తి ఎలా చెప్పుకోగలరు? అని ప్రశ్నించారు. ఆయన అనుకున్నట్టే జరిగితే ఢిల్లీలో నియంతృత్వం అవుతుందన్నారు. ఇంత కంటే హాస్యాస్పదమైన విషయం మరొకటి లేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AAP  Central govt  Najeeb Jung  Kejriwal  Modi  Posters  Swathi  

Other Articles