Gold rate | Gold | Bullion Market | China, India, Investments

Wait one more week to buy gold at lowest cost

Gold rate, Gold, Bullion Market, China, India, Investments

Wait one more week to buy gold at lowest cost. Bullion market falling down and gold price came low. gold rate maybe came to 21thousand in the next week.

బంగారం కొంటున్నారా..? ఇంకో వారం ఆగండి

Posted: 07/22/2015 10:27 AM IST
Wait one more week to buy gold at lowest cost

బంగారం.. నిజంగా అందరికీ బంగారమే.. పుస్తకం హస్త భూషణం అంటారు కానీ అసలు భూషణాలు బంగారానివైతే ఆ ఆనందమే వేరే. అయితే తాజాగా మార్కెట్లో వస్తున్న పరిణామాలు బంగారం రేట్ మీద బాగా చూపిస్తున్నాయి. దాంతో ఆకాశంలో ఉన్న బంగారం రేట్ అమాంతం.. నేలకు దిగి వచ్చింది. ప్రస్తుతం 24 వేల పైచిలుకు ఉన్న బంగారం ధర.. మరింత తగ్గే అవకాశం కలుగనుంది. అయితే ఎందుకు అలా బంగారం ధర తగ్గుతోంది....? ఎంత వరకు తగ్గవచ్చు.? ఎంత వరకు వచ్చి ఆగిపోతుంది..? ఎంతలో కొంటే మీకు లాభం.? ఆడవాళ్లు అయితే ఎలా కొనాలి..? ఎంత కొనాలి..? ఇన్వెస్టర్ల్స్ అయితే ఎలా కొనాలి .? ఎంత కొనాలి..? ఇలా అన్నింటికి సమాధానాల కోసం కింద చదవండి.

బంగారం ధర 35వేల రూపాయలు... ఈ రోజు బులియన్ మార్కెట్ లో బంగారం ధర 30 వేలు ఇలా.. బోలెడు బంగారం రేట్ల గురించి విని ఉంటారు. కానీ గతవారం రోజులుగా బంగారం ధర చాలా తగ్గింది. ఏకంగా 25 వేల కిందకు తగ్గడం రికార్డ్ సృష్టించింది. అయితే ఇలా ఎందుకు జరుగుతొంది..? అంటే అంతర్జాతీయ మార్కెట్ లో పరిణామాలు, చైనా బంగారం ఉత్పత్తి, అమెరికా ఇన్వెన్టర్స్ మారిన వైఖరి ఇలా చాలా కారణాలు ఉన్నాయి. అయితే మనకు ఇవన్నీ అక్కర్లేదు. కావాల్సిందంతా.. బంగారం ధర ఎంత తగ్గుతుంది అనే కదా.. అయితే ప్రస్తుతం బంగారం ధర 24 వేల నుండి 25 వేల మధ్య ఉంది. కాగా వచ్చే వారంలో బంగారం ధర దాదాపు 21 వేల నుండి 22వేల మధ్య అంటూ బహుశా 21వేల 500 వరకు రావచ్చు అనే ఊహ ఉంది. అందుకే ఆ టైంలో ఆడవాళ్లు బంగారం కొనడం మంచిది. అయితే ఇన్వెస్టర్లు మాత్రం ఒక్కసారిగా బంగారం కొనకుండా కొంచెం కొంచెంగా కొంటూ.. కొంత మొత్తాన్ని బాండ్లకు మళ్లించడం మంచిది. అలా చేస్తే మార్కెట్ లో ఒడిదుడుకులను తట్టుకునే అవకాశాలు మెండు ఉంటాయి. మరి మీరు కూడా ఇలానే చేస్తున్నారుగా..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gold rate  Gold  Bullion Market  China  India  Investments  

Other Articles