President | Pranabh Mukharjee | Rastrapati Bhavan | RTI, Phone bill

President pranab mukherjee rakes up 5 lakh phone bill

President, Pranabh Mukharjee, Rastrapati Bhavan, RTI, Phone bill

President Pranab Mukherjee Rakes Up 5 Lakh Phone Bill An RTI enquiry has revealed that President Pranab Mukherjee’s phone bill in the month of May swelled to a whooping Rs. 5 lakhs. The disclosure came when Jogeshwari resident Mansoor Darvesh filed a RTI query in June seeking details about the upkeep of India’s biggest and most prominent house- Rashtrapati Bhawan.

ఫోన్ బిల్ అక్షరాల ఐదు లక్షలు

Posted: 07/20/2015 04:35 PM IST
President pranab mukherjee rakes up 5 lakh phone bill

అవును.. అక్షరాల ఐదు లక్షల రూపాయలు ఫోన్ బిల్ వచ్చింది. ఏంటి ఏ కాల్ సెంటర్ ఫోన్ బిల్లో అని అనుకుంటున్నారేమో కానీ కానేకాదు ఒకే ఒక వ్యక్తి ఫోన్ బిల్ ఐదు లక్షల రూపాయలు.. ఐతే రాష్ట్రపతి భవన్ లో వాడుతున్న ఫోన్ లు, అసలు మొత్తానికి రాష్ట్రపతి భవన్ కు ఎంత ఖర్చు చేశారు అని ఓ సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారం మేరకు తాజాగా రాష్ట్రపతి భవన్ ఫోన్ బిల్ వ్యవమారం వెలుగులోకి వచ్చింది. అయితే రాష్ట్రపతి భవన్ లో ఫోన్ బిల్లు ఒక్కటే కాదు చాలా దుబారానే జరుగుతోందని సమాచారం. గతంలో 30 కోట్ల దగ్గర ఉన్న రాష్ట్రపతి భవన్ ఖర్చు ఏకంగా 42 కోట్లను దాటడం మీద సర్వత్రా చర్చ సాగుతోంది. అయితే గతంలో అబ్దుల్ కలాం హయాంలో దుబారాకు కళ్లెం వేసిన కలాంను తర్వాత వచ్చిన వారెవరు కూడా ఆదర్శంగా తీసుకోలేకపోతున్నారు. రాష్ట్రపతి భవన్ అంటేనే సకల సదుపాయాలు కలిగిన స్వర్గంలా ఉంటుంది అని అందరికి తెలుసు. అయితే ఇంత ఖర్చు ఉంటుంది అని మాత్రం తాజాగానే వెలుగులోకి వచ్చింది.

గతంలో 2012-13గాను 30.96కోట్లు ఖర్చు చెయ్యగా,  2013-14గాను  38.70కోట్లు ఇక  2014-15గాను ఏకంగా 41.96 కోట్లకు చేరడం విశేషం. అయితే గతంలో కన్నా దాదాపు 33 శాతం ఖర్చు పెరగడం మీద అందరు నోళ్లెల్లబెడుతున్నారు. మొత్తం రాష్ట్రపతి భవన్లో 757 మంది ఉద్యోగులు ఉన్నారని, అందులో 27 మంది డ్రైవర్లు, 64 మంది సఫాయివాలాలు, 8 మంది టెలిఫోన్ ఆపరేటర్లు పని చేస్తున్నట్లు సమాచారం అందించారు. మే నెలలో జీతాలకు గాను 5.06లక్షలు ఖర్చు చేశారని, అదే నెలలో ఫోన్ బిల్ 5.06 లక్షలు అని, అదే విధంగా ఏప్రిల్ లో గతంలోని 4.25 లక్షలకు మించి 5.06  లకు చేరడం విశేషం.
 
అయితే దార్వేష్ అనే వ్యక్తి రాష్ట్రపతి భవన్  ఖర్చుల మీద అడిగిన సమాచారంలో కొంత సమాచారాన్ని మాత్రమే అందించారని ఆయన అంటున్నారు. తన అంచనా ప్రకారం రాష్ట్రపతి భవన్ దాదాపు 100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు భావిస్తున్నారని అన్నారు. తాజాగా తనకు అందించిన సమాచారంలో చాలా వరకు అసంపూర్తిగా ఉంది అని వివరించారు. లెక్కకు మించిన ఖర్చుతో రాష్ట్రపతి భవన్ విపరీతంగా ఖర్చు చేస్తోందని అన్నారు. అయితే దేశ పౌరుడిగా రాష్ట్రపతి భవన్  ఎంత ఖర్చు చేస్తోందో అని తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టం కింద కోరానని, కానీ తనకు పూర్తి స్థాయి సమాచారం అందలేదని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : President  Pranabh Mukharjee  Rastrapati Bhavan  RTI  Phone bill  

Other Articles