e coli, bacteria, godavari, pushkaralu, .godavari pushkaralu, telugu states, ap, telangana, pushkara ghats, holy dip

High bacterial levels in godavari pose health risk

e coli, bacteria, godavari, pushkaralu, .godavari pushkaralu, telugu states, ap, telangana, pushkara ghats, holy dip

High Bacterial Levels in Godavari Pose Health Risk. With lakhs of pilgrims taking a holy dip in the Godavari, a new threat is emerging from its water. According to experts, T-Coli (Total Coliform bacteria) levels are alarmingly high in the river water even before the puskharams commenced and they believe that the endless stream of pilgrims doing their ablutions would further increase the contamination levels. The government expects more than 2 crore people to take a dip in the river during the 12-day event. Doctors advise people to take proper precautions to avoid bacterial infections.

బ్యాక్టీరియా కలదు.. పుష్కర స్నానం జాగ్రత్తగా చెయ్యండి

Posted: 07/20/2015 09:13 AM IST
High bacterial levels in godavari pose health risk

గోదావరి మహా పుష్కరాలకు కోట్ల మంది భక్తులు క్యు కట్టారు. పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే గోదావరి మహా పుష్కరాలకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశంలోని చాలా ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు. అయితే గోదావరి నీటిలో బాక్టీరియా సాధారణ స్థాయి కన్నా పది రెట్లు అధికంగా ఉందని కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ఇచ్చిన నేపధ్యంలో పుష్కర స్నానాల విషయంలో భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కవ సమయం నీటిలో ఉండవద్దు. మూడు నిమిషాల్లో స్నానం ముగించుకుని బయటకు రావాలి. కళ్లు, ముక్కు, నోటిలోకి నీళ్లు పోకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పిల్లల్ని ఎక్కవ సేపు నిటిలో ఉంచవద్దు. సాధారణంగా వంద మిల్లీ లీటర్ల నీటిలో ఈకోలీ 500 కాలనీల వరకు ఉండొచ్చు. గోదావరి నీటిలో 5 వేల వరకు ఉందని అధికారులు గుర్తించారు.

danger-bacteria

స్పచ్చంగా లేని.. బురద నీటిలో ఈకోలీ బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు ఈకోలీ నీటిలో స్నానం చేయడం ఇబ్బందికరం. ఎండ ఎక్కవగా ఉన్న నీటిలోనే స్నానం చేయాలి. కళ్లు చెవులు, నోటిలోకి నీళ్లు పోకుండా చూసుకోవాలి. మునకకు ముందు బాగా గాలి పీల్చుకుని. మూడు మునకలు వేసి బయటకు వచ్చేయాలి. పుష్క స్నానం అయిన వెంటనే మంచి నీటితో స్నానం చేయాలి. నదిలో స్నానం చేసిన బట్టలను వెంటనే విడిచి పొడి బట్టలు ధరించాలి. పొరపాటున నీటిని నోట్లోకి తీసుకుని తాగితే వెంటనే ఏమీ తెలియదు. రెండు రోజుల తర్వాత నీరసం , వాంతులు, విరోచనాలతో కూడిన లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి ఇంకా శనివారం వరకు గోదావరి మహా పుష్కరాలు సాగునున్న నేపథ్యంలొ పుష్కర స్నానానికి వెళ్లే భక్తులు కొన్ని జాగ్రత్తలు పాటించి.. పుణ్యంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్నవారవుతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : e coli  bacteria  godavari  pushkaralu  .godavari pushkaralu  telugu states  ap  telangana  pushkara ghats  holy dip  

Other Articles