Ex-MP Opens Fire, Threatens Suicide to Evade Arrest

Ex mp opens fire in air as police foil hunger strike

Ex-MP Opens Fire, Threatens Suicide to Evade Arrest, Ex-MP opens fire in air as police foil hunger strike, harsha kumar, fires in air, sucide, evade arrest, former MP, threatened to commit suicide, fired two rounds in air, hunger strike, godavari Puskharam, Ap Chief Minister chandrababu visit, lathicharge, rajamundry, christain burrial ground, revolver

Tension prevailed at the Jampeta Church here Saturday evening when former MP GV Harsha Kumar threatened to commit suicide and fired two rounds in the air from his revolver in an attempt to prevent the police from foiling his hunger strike.

రాజమండ్రిలో రణరంగం.. టీకప్పులో తుఫానులా చల్లారిన హైటెన్షన్

Posted: 07/12/2015 03:11 PM IST
Ex mp opens fire in air as police foil hunger strike

మాజీ ఎంపీ హర్షకుమార్‌ రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. గత మూడు రోజులుగా ఆయన అమరణ నిరహారా దీక్షను పోలీసులు నిన్న రాత్రి భగ్నం చేసి ప్రభుత్వ అస్పత్రికి తరలించినా.. ఆయన వైద్యాన్ని నిరాకరిస్తూ దీక్షను కోనసాగిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి హర్షకుమార్‌ ఆస్పత్రి ఎదుట రోడ్డుపై బెఠాయించారు. ఆ తర్వాత మూడవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట నిరసన తెలిపారు. తనపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీ చార్జీ చేశారని, తన కుమారుడిని పోలిస్ స్టేషన్ లో బంధించారని ఆయన ఆరోపించారు.

రాజమండ్రి నగరంలో క్రైస్తవులకు శ్మశాన వాటిక, ముస్లింలకు షాదీఖానా నిర్మించాలని డిమాండ్ చేస్తూ హర్షకుమార్‌ అమరణ దీక్ష పూనుకున్న విషయం తెలిసిందే. హర్షకుమార్ ఆరోగ్యం విషమిస్తుండడంతో శనివారం సాయంత్రం పోలీసులు దీక్ష జరుగుతున్న సెయింట్‌పాల్‌ చర్చి మైదానంలోకి ప్రవేశించారు. పోలీసులు రావడాన్ని గమనించిన హర్షకుమార్‌ దీక్షను భగ్నం చేయడానికే వారు వచ్చారని, వారిని వెళ్లిపోవాల్సిందిగా కోరారు. అయితే, పోలీసులు వేదిక వైపు వస్తుండటంతో తన వద్దనున్న తుపాకీని తీసి దగ్గరకు వస్తే కాల్చుకుంటానని బెదిరించారు.
 
అయినా పోలీసులు వేదికను చుట్టుముట్టడంతో ఆయన రెండుసార్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన పోలీసులు ఒక్కసారిగా వేదికపైకి ఎక్కి హర్షకుమార్‌ నుంచి తుపాకీని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో వేదిక వద్ద తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. హర్షకుమార్‌కూ స్వల్ప గాయాలయ్యాయి. దీక్షను భగ్నం చేసిన పోలీసులు హర్షకుమార్‌ను బలవంతంగా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలోనూ దీక్షను కొనసాగిస్తానని ప్రకటించిన ఆయన అక్కడ అదృశ్యమై.. రాజమండ్రి మూడవ పట్టణ పోలీసు స్టేషనులో ఎదుట ధర్నాకు దిగారు. తనపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీ చార్జీ చేశారని, తన కుమారుడిని పోలిస్ స్టేషన్ లో బంధించారని హర్షకుమార్ ఆరోపించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : harsha kumar  fires  sucide  evade arrest  rajamundry  

Other Articles