Greece | Economy | bailout deal | EU | euro currency | europian union | germany

Greece rejected a bailout deal but the country getting more danger situation

Greece, Economy, a bailout deal, EU, euro currency, europian union, germany

Greece rejected a bailout deal but the country getting more danger situation. Greeks on Sunday decisively rejected a bailout deal proposed by the country's international creditors, which demanded new austerity measures in return for emergency funds. The vote amounted to a stinging rebuke of the austerity measures imposed on Greece since 2010.

పెనం మీద నుండి పొయ్యిలో పడింది గ్రీస్..

Posted: 07/06/2015 03:30 PM IST
Greece rejected a bailout deal but the country getting more danger situation

గ్రీస్‌ సంక్షోభానికి కారణం ఏంటి.? వేల కోట్ల యూరోల అప్పుల్లో ఎందుకు కూరుకుపోయింది.? డిఫాల్టర్‌గా మారడానికి దారితీసిన కారణాలు ఏంటి.? ఇలాంటి ప్రశ్నలకు చాలానే సమాధానాలు ఉన్నాయి. గ్రీస్‌ సంక్షోభం యావత్‌ ప్రపంచానికి కనువిప్పనే చెప్పాలి. పొదుపు చర్యలు లేకుండా, అతిగా  అప్పులు చేస్తే.. ఎంత సంపన్న దేశమైనా ఎంతటి దుస్థితికి దిగజారిపోతోందో గ్రీస్‌ను చూస్తే అర్థమవుతుంది. జనాభా కోటి 10లక్షలు.. అప్పులు 32వేల కోట్ల డాలర్లు. ఇది యూరోపియన్‌ దేశం గ్రీస్‌ ఘనత. సామర్థ్యానికి మించి అప్పులు చేసుకుంటూ పోవడంతో.. జీడీపీలో రుణాలు 175శాతానికి చేరిపోయాయి. చిరుదేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశాయి. గ్రీస్‌ రుణభారం భారీగా పెరిగిపోవడానికి ఆ దేశ విధానాలే కారణం. అడ్డగోలుగా సబ్సిడీలు, లెక్కకు మించి సామాజిక సంక్షేమ పథకాలు, నిరుద్యోగ భృతి, పెన్షన్లు.. గ్రీస్‌ను అప్పుల ఊబిలో కూరుపోయేలా చేశాయి.

Also Read:  గ్రీస్ సంక్షోభం దెబ్బకు ప్రపంచం అబ్బా..

2008-09లో కూడా గ్రీస్‌ సంక్షోభంలో పడింది. అప్పటికే అప్పులు మొత్తం జీడీపీలో 109శాతానికి చేరాయి. 2010కి ఈ రుణాలు జీడీపీలో 146శాతానికి పెరిగిపోయాయి. రుణాలు చెల్లించలేక దివాలా తీయడంతో.. యూరోపియన్‌ యూనియన్‌, ఐఎంఎఫ్‌లు 26,400 కోట్ల డాలర్ల ప్యాకేజీ ఇచ్చి గట్టునపడేశాయి. ఆర్థిక క్రమశిక్షణకు కఠినమైన ఆంక్షలను కూడా విధించాయి. అయితే ఇంత జరిగినా గ్రీస్‌ మాత్రం తీరుమార్చుకోలేదు. యూరోపియన్‌ దేశాలు దయతో ఇచ్చిన ప్యాకేజీని.. పప్పు బెల్లంలా పంచేసింది. ఉచిత పథకాలకు వెదజల్లింది. ఆర్థిక పరిపుష్ఠికి ఏమాత్రం చర్యలు తీసుకోకుండా.. సబ్సిడీలకే పెద్దపీట వేసింది. దీంతో  అధోగమనంలో పడి.. జీడీపీలో అప్పు 175 శాతానికి పేరుకుపోయింది.

Also Read:  గ్రీస్ ప్రజలు రెఫరెండంపై ఏం చేస్తారో..?

కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అన్నట్లు.. ప్రజల్ని కూర్బోబెట్టి తిండిపెట్టడానికే గ్రీస్‌ అధిక ప్రాధాన్యత ఇవ్వడం.. ఆ దేశాన్ని దివాలా తీసేలా చేశాయి. మన దేశంలో రిటైర్మెంట్ తర్వాత 50శాతం పెన్షన్‌ ఇస్తుంటే.. గ్రీస్‌లో మాత్రం 96శాతం ఇస్తున్నారు. అంటే దాదాపు ఫుల్‌ సాలరీ ఇచ్చేస్తున్నారు. దీంతో పాటు సామాజిక భద్రతా పథకాలు ఇబ్బడిముబ్బడిగా పెట్టేశారు. నిరుద్యోగ భృతులు, పెన్షన్లు, ఉచిత ఆరోగ్య సేవలు.. ఇలా  అన్ని పెట్టేవే కానీ.. రాబడి వచ్చే మార్గాలే లేవు. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి.. డిఫాల్టర్‌గా మిగిలింది. పాత కరెన్సీ డ్రక్మాను తిరిగి వాడుకలోకి తేవాలన్న ఆ దేశ ప్రయత్నం కూడా చారిత్రక తప్పిదమే. ఎందుకంటే ఆ కరెన్సీ విలువ చాలా తక్కువ. దాన్ని అమల్లోకి తెస్తే ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోతుంది. బ్యాంకులు సంక్షోభంలో కూరుకుపోయి మూతపడతాయి. నిరుద్యోగం తీవ్రమై దేశ జీవనరేఖ అస్తవ్యవస్థమవుతుంది. ఈ నేపథ్యంలో బెయిలవుట్‌ ప్యాకేజీకి వ్యతిరేకంగా రెఫరెండంలో తీర్పు రావడం.. గ్రీస్‌ భవిష్యత్‌పై మరిన్ని ప్రశ్నలను రెకెత్తిస్తోంది.

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Greece  Economy  a bailout deal  EU  euro currency  europian union  germany  

Other Articles