Revanth Reddy | High court | Bail | Telangana | ACB | Supreme court

Telangana acb likely to approach to supreme court on revanth reddy bail judgement

Revanth Reddy, High court, Bail, Telangana, ACB, Supreme court

Telangana ACB likely to approach to supreme court on Revanth Reddy bail Judgement.Telangana ACB getting ready to fight aganist the high court judgement that Revanths Bail.

ITEMVIDEOS: రేవంత్ రెడ్డి బెయిల్ పై సుప్రీంలో పిటిషన్

Posted: 06/30/2015 03:42 PM IST
Telangana acb likely to approach to supreme court on revanth reddy bail judgement

ఓటుకు నోటు కేసులో ఎ1 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డికి తాజాగా హైకోర్ట్ బెయిల్ మంజూర్ చేసింది. అయితే తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఓటుకు నోటు కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న రేవంత్ రెడ్డికి బెయిల్ రావడంతో మొత్తం వ్యవహారం రసవత్తరంగా మారింది. అయితే కేసు కీలకదశలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డికి బెయిల్ రావడంపై తెలంగాణ ఏసీబీ వేగంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగా హైకోర్ట్ ఇచ్చిన తీర్పు మీద సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించనున్నట్లు సమాచారం. తెలంగాణ ఏసీబీ అధికారులు ఓటుకు నోటు వ్యవహారంలో ఎంతో పట్టుమీదున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి బెయిల్ ను సవాల్ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ ఏసీబీ అధికారులు వేగంగా పావులు కదుపుతున్నారు. వీలైతే రేపు లేదంటే ఎల్లుండి సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు ఫైల్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే హైకోర్టు అన్నీ విషయాలను పరిగణలోకి తీసుకొనే రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూర్ చేశారు కాబట్టి సుప్రీం కోర్టుకు వెళ్లినా కానీ పెద్దగా ప్రయోజనం ఉండదని రేవంత్ వర్గీయులు బావిస్తున్నారు. రేవంత్ రెడ్డి బెయిల్ మీద విడుదల కావడం వల్ల కేసు నీరుగార్చే అవకాశం ఉందని తెలంగాణ ఏసీబీ గట్టిగా వాదిస్తోంది. అయితే రేవంత్ రెడ్డికి బెయిల్ తాత్కాలిక ఊరట మాత్రమే అని టిఆర్ఎస్ నేతలు ఇప్పటికే ప్రకటనలు చేశారు. దాంతో రేవంత్ రెడ్డి వ్యవహారం మళ్లీ ఏ కీలక మలుపు తిరుగుతుందో అని అందరూ చర్చించుకుంటున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth Reddy  High court  Bail  Telangana  ACB  Supreme court  

Other Articles