Lalit Modi alleges Suresh Raina, Dwayne Bravo, Ravindra Jadeja involved in IPL betting

Lalit modi names three cricketers who were bribed

ipl scandal, ipl spot fixing, lalit modi, suresh raina, dwayne bravo, ravindra jadeja, csk, chennai super kings, IPL spot-fixing, IPL, International cricket council, Dave Richardson,

After politicians and bureaucrats, it is now the turn of cricketers to be burnt by former IPL commissioner Lalit Modi's fire.

రాజకీయ నేతల తరువాత.. క్రికెటర్లపై బురదజల్లిన మోదీ..

Posted: 06/27/2015 10:56 PM IST
Lalit modi names three cricketers who were bribed

అంతా అనుకున్నట్లే జరుగుతోంది. తాను ఎక్కడో తలదాచుకుని భారత రాజకీయ నేతలను వివాదాల్లోకి లాగుతున్న ఐపిఎల్ వ్యవస్థాపక చైర్మన్, ఐపీఎల్ ఆర్థిక నేరాలకు, నిధుల మళ్లింపు కేసులో అభియోగాలు ఎదుర్కోంటున్న లలిత్ మోడీ.. పథకం ప్రకారమే ఒక్కక్కరినీ వివాదాల్లోకి లాగుతున్నాడా..? అంటే అవుననే సందేహాలే వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు రాజకీయ నేతలను టార్గెట్ చేస్తు సామాజిక మాధ్యమం ద్వారా ఆరోపణలు గుప్పిస్తున్న మోడీ ఇప్పడు ఏకంగా క్రికెటర్లకు అవినీతి మఖిలీ అంటించేందుక ప్రయత్నాలు చేశారు.

ఐఫీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టకు ప్రాతినిథ్యవ వహిస్తున్న సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, డ్వయిన్ బ్రావోలు బెట్టింగ్ లకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ మేరకు శనివారం రాత్రి ఆయన ట్విట్టర్ ను అనుసంధానంగా చేసుకుని పలు ఆరోపణలు గుప్పించారు. బాబా దివాన్ అనే బుకీ ఈ ముగ్గురు ఆటగాళ్లకు భారీ మోత్తంలో డబ్బు ఇవ్వడమే కాకుండా పలు చోట్ల ఫ్లాట్లు కూడా కొనిచ్చాడని చెప్పారు. ఇదే విషయమై ఐసీసీ షీఈవో డేవ్ స్మిత్ రిచర్డ్ సన్ కు 2013లో తాను రాసిన లేఖను మోదీ బహిర్గం చేశారు. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు బెట్టింగ్, పిక్సింగ్ లకు పాల్పడి అనర్హులుగా ముద్రపడగా, మోడీ తాజా అరోపణల నేపథ్యంలో ఏ ఏ ఆటగాళ్లకు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో వేచి చూడాల్సిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lalit Modi  IPL betting  Suresh Raina  Dwayne Bravo  Ravindra Jadeja  

Other Articles