Ramakrishna Reddy |Advocate Geneeral | Telangana | ACB | revanth Reddy

On revanth reddy bail petetion advocate generalo ramakrishna reddy strong argument in the high court

Ramakrishna Reddy, Advocate Geneeral, Telangana, ACB, revanth Reddy

On Revanth Reddy bail petetion advocate generalo ramakrishna Reddy strong argument in the High court. ramakrishna Reddy questions the revanth reddy on cash for vote case.

రేవంత్ బెయిల్ పిటిషన్ పై ఏజి వాదన సూపర్

Posted: 06/26/2015 04:20 PM IST
On revanth reddy bail petetion advocate generalo ramakrishna reddy strong argument in the high court

ఓటుకు నోటు కేసులో నిందితుడు రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హాట్ హాట్ గా వాదనలు కొనసాగాయి. సుమారు గంటన్నరసేపు వాదనలు జరిగాయి. రేవంత్ తరపు న్యాయవాది, ఏసబీ న్యాయవాది ఇద్దరూ పోటాపోటీగా వాదించారు. నిందితునికి బెయిలు ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని, రేవంత్ ఎమ్మెల్యేగా ఉన్నారని, కేసులో పూర్తి దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశముందని, బెయిలు ఇవ్వకూడదని ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి తన వాదనలు వినిపించారు. ఈ కేసులో ఇంకా కొందరు నిందితులు తప్పించుకుని తిరుగుతున్నారని, వారు పక్క రాష్ట్రం ఏపీలో దాక్కున్నారని, వారిని అరెస్టు చేసి విచారించాల్సి ఉందని, ఈ సందర్భంలో రేవంత్ కు బెయిలు ఇస్తే ఆయన కూడా ఏపీకి పారిపోయే ప్రమాదముందని ఏసీ వాదించారు.

ఏపీలో ఉన్న నిందితులను అరెస్టు చేసే విషయంలో ఆ రాష్ట్ర పోలీసులు సహకరించడం లేదని ఏజీ జడ్జీకి వివరించారు. ఓటుకు నోటు కేసు చిన్నదేమీ కాదని, 10 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఉంటే ప్రభుత్వమే కూలిపోయేదని, ఇది రాజద్రోహం కేసు కిందకు వస్తుందని ఏజీ రామకృష్ణా రెడ్డి వాదించారు. ఇంకా ఈ కేసులో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియాల్సి ఉందని కూడా కోర్టులో వాదించారు. ఏసీబీ కస్టడీలో రేవంత్‌రెడ్డి ఏమి చెప్పలేదా అని ఏజీని జడ్జీ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఏజీ సమాధానమిస్తూ.. రేవంత్ ఏ ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానం చెప్పలేదని, రూ. 5కోట్ల గురించిన అడిగినా సమాధానం లేదని ఏజీ జడ్జీకి తెలిపారు. ఈ కేసులో సండ్ర వెంకట రమణ తప్పించుకు తిరుగుతున్నాడని కోర్టుకు చెప్పారు. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టు ప్రకారం ఈ కేసులో ఇంకా కొంత మందిని విచారించే అవసరం ఉందని వాదించారు.ఇప్పటికే 25 రోజులకు పైగా నిందితుడు రిమాండ్ లో ఉన్నారని, ఈ సమయంలో నిందితున్ని పూర్తిగా విచారించడం జరగిందని, ఈ కసులో దాదాపు విచారణ మొత్తం పూర్తయిందని, అయినా ఇంకా నిందితున్ని రిమాండులో ఉంచాల్సిన అవసరమేముందని రేవంత్ తరపు న్యాయవాది వాదించగా దానికి కౌంటర్ గా ఏసీబీ తరపు న్యాయవాది ఏజీ రామకృష్ణా రెడ్డి తన వాదనలు వినిపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramakrishna Reddy  Advocate Geneeral  Telangana  ACB  revanth Reddy  

Other Articles