Chandrababu naidu | Telangana | Notices

Telangana govt dicided to dont issue the notices to ap cm telugudesamparty president chandrababu naidu

Chandrababu naidu, Telangana, NOtices, ap, cash for vote, Revanth Reddy, Mathaih, babu

Telangana govt dicided to dont issue the notices to ap cm Telugudesamparty president Chandrababu naidu. In the cash for vote case govt decided to dont issue the notics to babu.

చంద్రబాబుకు నోటీస్ లు లేవు... రావు!

Posted: 06/22/2015 08:12 AM IST
Telangana govt dicided to dont issue the notices to ap cm telugudesamparty president chandrababu naidu

తెలుగు రాష్ట్రాల్లో ఒకటే టెన్షన్ ఎప్పుడు ఏం జరుగతుందా అని నరాలు తెగేంత టెన్షన్. గంట గంటకు టివి ఛానల్స్ లో ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు నాయుడుకు నోటీసులు వస్తాయంటూ ఒకటే మోత. తెలంగాణ సర్కార్ అంతా సిద్దమైంది ఇక నోటీసులు ఇవ్వాలి కానీ ఎలా ఇవ్వాలని అని ఆలోచనలో ఉంది అని టివి చానల్స్ చేసిన హడావిడితో తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా టెన్షన్ కు లోనయ్యారు. అయితే అంత జరిగిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోలేదు. తెలంగాణ సర్కార్ ఏపి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు నోటీసులు పంపించాలని దాదాపుగా డిసైడ్ అయింది. కానీ తర్వాత మాత్రం నోటీసుల జోలికి వెళ్లలేదు. అయితే చంద్రబాబు నాయుడుకు నోటీసులు రాకపోవడానికి ఏంటి అనే చర్చ సాగుతోంది.

* కేంద్ర ప్రభుత్వం చేసిన వత్తిడి వల్లే తెలంగాణ సర్కార్ వెనక్కి తగ్గిందా..?
* తెలంగాణ, ఏపిల మధ్య తగాదాలకు గవర్నర్ ఫుల్ స్టాప్ పెట్టారా..?
* ఫోన్ ట్యాపింగ్ వివాదం మెడకు చుట్టుకుంటుందని తెరాస భయపడుతోందా..?
* చంద్రబాబు, కేసీఆర్ అవగాహనకు వచ్చారా..?
* ఆడియో టేపుల్లో ఉన్నది చంద్రబాబు నాయుడు వాయిస్ కాదా..?

ఏపీ సీఎం చంద్రబాబుకు వాయిస్‌ టెస్ట్‌ నిర్వహించొద్దని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ అధికారులకు ఓరల్ ఇన్ స్ట్రక్షన్స్ (మౌఖిక ఆదేశాలు) అందాయా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. చంద్రబాబు స్థాయి వ్యక్తికి నోటీసులు ఇచ్చినా, వాయిస్‌ టెస్ట్‌ చేసినా అది వివాదాస్పదమవుతుందని భావిస్తున్న తెలంగాణ పోలీసులు ఈ విషయంలో సంయమనంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు నోటీసులు జారీ చేయడం వంటివి చేయకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల ప్రజలను టెన్షన్ పెట్టిన ఓటుకు నోటు వ్యవహారంలో ఎలాంటి డెవలప్ మెంట్ లేదు. ఇక మరో పక్క రేవంత్ రెడ్డి, మత్తయ్యల పిటిషన్ లు కోర్టులో ఈ నెల 24న వాదనకు సిద్దంగా ఉన్నాయి. మరి ఈ రోజు ఏం జరుగుతుందో చూడాలి.

//అభినవచారి//

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : Chandrababu naidu  Telangana  NOtices  ap  cash for vote  Revanth Reddy  Mathaih  babu  

Other Articles