Yoga day | Yoga | India | Modi

The world is going to celebrate the international yoga day

Yoga day, Yoga, India, Modi, america

The world is going to celebrate the International Yoga day. India and 191 countries from the world clebrates grandly yoga day.

ITEMVIDEOS: ప్రపంచానికిది ఆరోగ్య 'యోగం'

Posted: 06/20/2015 04:19 PM IST
The world is going to celebrate the international yoga day

ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒకే జపం చేస్తోంది. రేపు జరిగే ఇంటర్నేనల్ యోగా డేకు అన్ని దేశాల ప్రజలు బిజీబిజీగా యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే గతంలో చరిత్రలో ఎరుగని విధంగా ప్రపంచం మొత్తం యోగా చేసేందుకు సిద్దమవుతోంది. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందడంపై సర్వత్రా చర్చసాగుతోంది. భారత కీర్త పతాకాన్ని ప్రపంచపు వినువీధుల్లో తలెత్తుకునేలా చేశారు ప్రధాని నరేంద్రమోదీ. ప్రపంచ దేశాల చేత యోగాడేకు అంగీకారం తెలిపేలా విశూష కృషి చేస్తున్నారు. ప్రపంచంలోని 192 దేశాల్లో దాదాపు 200 కోట్ల మంది యోగా చెయ్యడానికి సిద్దపడుతున్నారు. మానవజాతి చరిత్రలో భారత యోగ చరిత్రను గురించి బంగారు అక్షరాలతో లిఖించేటంతగా ప్రపంచ యోగా దినోత్సవాన్ని భారత్ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు చేస్తోంది.

యావత్ ప్రపంచానికి యోగా పాఠాలు నేర్పుతున్న భారత మాణిక్యాల కృషి, ప్రధాని నరేంద్ర మోదీ గారి సంకల్పం ప్రపంచం మొత్తం యోగాను ఆమోదించేలా చేసింది. అయితే నిన్నటి దాకా ఒక మతానికి చెందిన ఆచారంలో భాగంగా భావిస్తున్న యోగాపై నిజాలు తెలుసుకుంటోంది ప్రపంచం. యోగా అనేది ఓ సంప్రదాయం.. ఏ మతం, ఏ ప్రాంతం, ఏ జాతి, ఏ వయస్సు అన్న భేదాలు లేకుండా యోగా చేసేందుకు ప్రపంచ దేశాలు సిద్దమవుతున్నాయి. ఓ వైపు యోగా గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డులు సృష్టిస్తూనే మరోపక్క ప్రపంచానికి ఆరోగ్య పాఠాలు నేర్పుతోంది. తాజాగా యోగా గురించి ప్రజలు తెలుసుకుంటున్నారు. అయితే భారతదేశం ఎంతో సగర్వంగా చేస్తున్న యోగా డే, యోగా గురించి మరిన్ని వివరాలు మీ కోసం..

హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగమైన యోగాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించిన ఆద్యుడు పతంజలి. క్రీస్తు పూర్వము 100వ శకము 500వ శకము మధ్య కాలములో ఈ రచన జరిగినట్లు పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ఉపనిషత్తులు, భగవద్గీతలో యోగా ప్రస్తావన ఉంది. పతంజలి వీటిని పతంజలి యోగసూత్రాలు గా క్రోడీకరించాడు. సూత్రము అంటే దారము. దారములో మణులను చేర్చినట్లు యోగశాస్త్రాన్ని పతంజలి ఒకచోట చేర్చాడు. హఠయోగ ప్రదీపిక, శివ సంహిత దానిలో ప్రధాన భాగాలు. అంతర్భాగాలైన కర్మయోగము, జ్ఞానయోగము, రాజయోగము, భక్తియోగము మొదలైనవి హిందూతత్వంలో భాగాలు. వ్యాసముని విరచితమైన భగద్గీతలో యోగాసనాలు పదినెనిమిది భాగాలుగా విభజించి చెప్పబడినవి.

యోగము అంటే ఏమిటి?

"యుజ్" అంటే "కలయిక" అనే సంస్కృత ధాతువు నుండి "యోగ" లేదా "యోగము" అనే పదం ఉత్పన్నమైంది. "యోగము" అంటే సాధన అని అర్థం. "యుజ్యతేఏతదితి యోగః", "యుజ్యతే అనేన ఇతి యోగః" వంటి నిర్వచనాల ద్వారా చెప్పబడిన భావము - యోగమనగా ఇంద్రియములను వశపరచుకొని, చిత్తమును ఈశ్వరుబియందు లయం చేయుట. మానవిని మానసిక శక్తులన్నింటిని ఏకమొనర్చి సామాన్య స్థితిని చేకూర్చి భగవన్మయమొనరించుట. ఇలా ఏకాగ్రత సాధించడం వలన జీవావధులను భగ్నం చేసి, పరమార్ధ తత్వమునకు త్రోవచేసుకొని పోవచ్చును. అలా ఆత్మ తనలో నిగూఢంగా ఉన్న నిజ శక్తిని సాధిస్తుంది.

 యోగ విద్య భారతీయ ప్రాచీన వారత్వం. వేల సంవత్సరాల కింద పతంజలి మహర్షి మానవ శరీర నిర్మాణ రహస్యాలను ఆవిష్కరించారు. శరీర ధర్మాలను గుర్తెరిగి ఆరోగ్యం కోసం యోగాసనాలను ఆవిష్కరించారు. ప్రాణాయామం, సూర్యనమస్కారాలు, యోగాసనాలు యోగ విద్యలో కీలకం. పతంజలి తర్వాత ఎందరో మహర్షులు దీనికి శాస్త్రప్రతిపత్తి కల్పించారు. ఆధునిక జీవన విధానం వల్ల తలెత్తుతున్న శారీరక, మానసిక రుగ్మతలకు నివారణగా యోగా అత్యంత ప్రజాదరణ పొందుతున్నది. జ్ఞాపక శక్తిని పెంచడం.. ఉల్లాసం, ఉత్సాహాన్ని నింపడం.. ఎక్కువ పనిచేసే సామర్థాన్నివ్వడం.. మనసును అధీనంలో ఉంచడం.. ప్రశాంతత చేకూర్చడం.. వ్యాధులను దరిచేరన్వికపోవడం.. వంటి ఎన్నో ప్రయోజనాలు యోగా వల్ల ఉన్నాయి. అందుకే ఈ ప్రాచీన విద్యకు అంతర్జాతీయం గుర్తింపు ఉంది. భారత ప్రధాని మోదీ ఐక్య రాజ్యసమితిలో చేసిన తీర్మానానికి ప్రపంచ దేశాలు మద్దతు తెలిపాయి. జూన్‌ 21ను అంతర్జాతీయ యోగా దినంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఇది భారతీయ ప్రాచీన విజ్ఞానానికి దొరికిన అరుదైన విశ్వ గౌరవం.

 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు భారీగా ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. జూన్‌ 21న నిర్వహించనున్న తొలి యోగా దినోత్సవంలో 192 దేశాల నుంచి దాదాపు 200 కోట్ల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఐరాసలో జరిగే వేడుకలకు భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌ నేతృత్వం వహించనున్నారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ బాన్‌ కీ మూన్‌, ప్రధానసభ అధ్యక్షుడు శామ్‌ కుతేశా, భారత ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ రవిశంకర్‌, పలువురు దౌత్యవేత్తలు, భారత్‌ నుంచి హాజరయ్యే విద్యార్థులు, ఐరాస అంతర్జాతీయ పాఠశాల విద్యార్థులు ఐరాసలో నిర్వహించే వేడుకలో పాల్గొంటారని అక్కడి భారత రాయబారి అశోక్‌ ముఖర్జీ చెప్పారు.

ఐరాస ప్రధాన కార్యాలయంలో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సుష్మాస్వరాజ్‌, ఐరాస సెక్రటరీ జనరల్‌, ప్రధాన సభ అధ్యక్షుడు.. న్యూయార్క్‌లోని టైమ్స్‌ స్క్వేర్‌కు చేరుకుని అక్కడ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. టైమ్‌స్క్వేర్‌లో 30వేల మంది యోగా చేస్తారని అంచనా వేస్తున్నారు. ఐరాస వేడుకలను అక్కడ భారీ తెరలపై ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఇది ఇలా ఉండగా ఖాట్మాండ్‌తో సహా నేపాల్‌లోని వివిధ నగరాల్లో భారత్‌.. యోగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. మరోవైపు ఢిల్లీలోని రాజ్‌పథ్‌ వద్ద కార్యక్రమం నిర్వహించనున్న వేదిక వద్ద భద్రతా బలగాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు ప్రముఖులు ఇక్కడ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఇది ఇలా ఉండగా, సముద్ర మట్టానికి దాదాపు 12వేల అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్‌ బేస్‌ క్యాంపు సైన్యానికి చెందిన దాదాపు 500 దళాలు యోగా కార్యక్రమంలో పాల్గొంటాయని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. పశ్చిమాన మధ్యదరా సముద్రంలో, పశ్చిమ పసిఫిక్‌ మహాసముద్రంలో, దక్షిణ హిందూ మహాసముద్రంలో మోహరించి ఉన్న నౌకాదళ బలగాలు యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నాయి.యోగాసనాలను దైనందిన కార్యకలాపాల్లో భాగం చేయాలని నౌకాదళం నిర్ణయించింది.

కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ లక్నో, వెంకయ్యనాయుడు చెన్నై, సదానందగౌడ తిరువనంతపురం, మనోహర్ పారికర్ మీరట్‌లో, ఇతర మంత్రులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో యోగా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని సంజీవయ్యపార్కులో నిర్వహించే యోగా శిబిరంలో కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి జేపీ నడ్డా పాల్గొననున్నారు. యోగా ఈవెంట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్న ఉత్తరాఖండ్ రాష్ట్రం మనసు మార్చుకున్నది. కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించనున్నది. శారీరక వ్యాయామ ప్రాధాన్యాన్ని చెప్పేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ యోగాడే కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా యోగా సాధన చేయాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి డాక్టర్ పూనమ్‌సింగ్ పేర్కొన్నారు. యోగా దినోత్సవానికి ఆస్ట్రేలియా యోగా అసోసియేషన్ మద్దతు తెలిపింది. భారతీయ రాయబార కార్యాలయంతో కలిసి అంతర్జాతీయ యోగా సదస్సును ఆదివారం మెల్‌బోర్న్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నది. ఈ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడుపాలని ఢిల్లీ మెట్రో ఏర్పాట్లు చేస్తున్నది.

మొత్తానికి ప్రపంచ గురువైన భారత్ మొదటిసారిగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అంగరంగ వైభవంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చేస్తోంది. ప్రపంచంలోని 192 దేశాల ప్రజలు యోగాను చేసేందుకు సిద్దంగా ఉన్నారు. దేహమును ప్రేమించుమన్న మంచి సైజులో ఉంచుమన్న అంటూ..  యోగా ఆవశ్యతను, ఆరోగ్యాన్ని గురించి ఓ కవిత నెట్ లో హల్ చేస్తోెంది.
దేహమంటే పొట్టకాదోయ్.. యోగచేసి బాగుపడవోయ్
వంటపై మీటింగ్ కట్టిపెట్టి గంట వాకింగ్ మొదలెట్టవోయ్
ఆకు కూరలొ చేవ ఉంది.. చూపు కోసం మంచిదంది..
రేకు టీనులో కోకు కన్నా బోండిమిచ్చే నీరు మిన్నా..
పిజ్జ బర్గర్ కట్టిపెట్టి ఆవిరిడ్లీ లాగించవోయ్..
మెట్టు మెట్టు ఎక్కిన అందలం ఆనందం, ఆరోగ్యం పదిలం..

 

అంతర్జాతీయ యోగా దినోత్సవం సంవర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ.. అందరికి ఆరోగ్యయోగం కలగాలని కోరుకుంటున్నాం..

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yoga day  Yoga  India  Modi  america  

Other Articles