ACBG, Telangana, Cash for vote, TTDP, Sandra Venkata Veriah

Sandra venkata veriah wrote a letter to telangana acb

ACBG, Telangana, Cash for vote, TTDP, Sandra Venkata Veriah

Sandra venkata Veriah wrote a letter to Telangana ACB. Sandra said that his health condition is sobad, so he cant attend to acb.

ఏసీబీ రమ్మంటే అనారోగ్యం అంటున్న సండ్ర

Posted: 06/19/2015 04:21 PM IST
Sandra venkata veriah wrote a letter to telangana acb

తెలంగాణ ఏసీబీ అధికారులు సాయంత్రం ఐదు గంటల వరకు ఏసీబీ విచారణకు హాజరుకావాలని సండ్ర వెంకటవీరయ్య ఇంటికి నోటీసులు అంటించింది. అయితే తాను తీవ్రమైన వెన్నునొప్పి, కాలినొప్పితో బాధపడుతున్నందున విచారణకు హాజరుకాలేకపోతున్నానని ఏసీబీ ఏసీపీ మల్లారెడ్డికి తెలంగాణ టీడీపీ నేత సండ్ర వెంకటవీరయ్య లేఖ రాశారు. అనారోగ్యంతో బాధపడుతున్నందున 10 రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు లేఖలో పేర్కొన్నారు.10 రోజుల తర్వాత విచారణకు సహకరిస్తానని ఆయన తెలిపారు. లేదంటే మీరే ఆస్పత్రికి వచ్చి సమాచారం సేకరించుకోవచ్చని సండ్ర లేఖలో కోరారు. మొత్తానికి  ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారుల విచారణకు తాను స్వయంగా రాలేనని, ఒకవేళ ఖచ్చితం అయితే హాస్పిటల్ లో వివరాలు అందించడానికి సిద్దంగా ఉన్నానని తెలుపుతూ సండ్ర రాసిన లేఖపై అప్పుడే విమర్శలు కూడా వస్తున్నాయి.

తెలంగాణ ఏసీబీ అధికారులు రమ్మని కబురు పంపించేసరికి ఎక్కడా లేని రోగాలు వచ్చాయా..? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. వేం నరేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలను ఓటుకు నోటు కేసులో విచారించేందుకు  ఏసీబీ అధికారులు ప్రయత్నించారు. అయితే ఏసీబీ అధికారులు సండ్ర ఇంటికి వచ్చిన సమయంలో అక్కడ ఆయన లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించి వెళ్లిపోయారు. అయితే నేటి సాయంత్రం ఐదు గంటల వరకు సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ ముందు హాజరుకావాల్సి ఉన్నా అనారోగ్య కారణాలతో రాలేనని లేఖ రాశారు. మరి దీనిపై తెలంగాణ ఏసీబీ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ACBG  Telangana  Cash for vote  TTDP  Sandra Venkata Veriah  

Other Articles