Telugu Student Pranith Elected for Presidential Scholarship in America | Telugu people in USA

Telugu student pranith elected for presidential scholarship in america

telugu student pranith, america presidential scholarship, pranith america scholarship, presidentical scholarship, america presidential scholarship, telugu boy pranith in america

Telugu Student Pranith Elected for Presidential Scholarship in America : Hyderabad couple Srinivas rao and shalini's son pranith has elected for Presidential Scholarship in America.

అమెరికాలో సత్తా చాటిన తెలుగుకుర్రాడు

Posted: 06/19/2015 10:05 AM IST
Telugu student pranith elected for presidential scholarship in america

ప్రపంచ అగ్రదేశాల్లో చక్రం తిప్పుతున్న అమెరికాలో తెలుగుతేజం తన సత్తా చాటాడు. 1964లో అమెరికాలో ‘ప్రెసిడెన్షియల్ స్కాలర్‌షిప్’ పేరిట ఓ స్కాలర్‌షిప్ పథకం ఏర్పాటు చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ పథకానికి హైదరాబాద్ నగరానికి చెందిన ప్రణీత్ పొలినేని అనే తెలుగుతేజం ఎంపికయ్యాడు.

హైదరాబాద్ నగరానికి చెందిన శ్రీనివాస్‌రావు, శాలిని దంపతులు అమెరికాలో సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడ్డారు. వారి ఏకైక కుమారుడు ప్రణీత్ ఫ్లోరిడా రాష్టంలో జాక్సన్‌విల్లేలోని స్టేషన్ కాలేజి ప్రిపేటరి స్కూల్లో 12వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక ప్రెసిడెన్షియల్ స్కాలర్‌షిప్‌కు ధరఖాస్తు చేసుకున్నాడు. ఈ స్కాలర్‌షిప్‌కు 30లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు వివిధ దశల్లో రకరకాల పరీక్షలు నిర్వహించారు. చివరకు 141 మంది విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారు.

అలా ఎంపికైన విద్యార్థుల్లో ఐదుగురు భారతీయులు కాగా అందులో ప్రణీత్ ఒకడు. ఈనెల 21న వాషింగ్టన్‌లోని అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్‌హౌస్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఒబామా చేతులమీదుగా స్కాలర్‌షిప్ అందుకోనున్నారు. ఈ అవార్డు అందుకున్న ప్రణీత్ తనకు ఎంతో సంతోషంగా వుందని.. తనకు అత్యుత్తమ వైద్యుడిగా సేవలు అందించడమే లక్ష్యమని పేర్కొన్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telugu student pranith  america presidential scholarship  

Other Articles