KCR, Mothkupally narsimlu, Telangana, Ap, Chandrababunaidu, Tapping

Tdp senior leader mothkupally narsimlu attacked on telangana cm kcr on the issue of phone tapping

KCR, Mothkupally narsimlu, Telangana, Ap, Chandrababunaidu, Tapping

TDP senior leader Mothkupally Narsimlu attacked on Telangana cm KCR on the issue of phone tapping. He said that telangana people hates KCR for his behaviour.

కేసీఆర్ ను ఛీకొడుతున్న ప్రజలు

Posted: 06/17/2015 01:38 PM IST
Tdp senior leader mothkupally narsimlu attacked on telangana cm kcr on the issue of phone tapping

ఓటుకు నోటు వ్యవహారంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు తారా స్థాయికి వచ్చాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వరుస భేటీలతో వాతావరణాన్కని వేడెక్కిస్తున్నారు. రానున్న 24 గంటల్లో సంచలనం అంటూ ఏపి హెచ్చరిస్తే,, తెలంగాణ ఏసీబీ మూడు గంటల్లోనే మరికొంత మందిని విచారించడానకి ప్రయత్నించింది. అయితే తెంలగాణ సర్కార్ మీద అన్ని రకాలుగా దాడిచెయ్యాలని డిసైడైన ఏపి సర్కార్ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి మీద దాడికి సిద్దమైంది. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాటల తూటాలు పేలుస్తున్నారు. తాజాగా టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సిములు కేసీఆర్ మీద విమర్శలు చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ను ప్రజలు ఛీకొడుతున్నారని అన్నారు. కేసీఆర్ సీఎంగా ప్రజలకు సేవ చేయాలే తప్ప....ఇతరరాష్ర్టాల సీఎంలను తిడుతూ బతకాలనుకోవడం దురదృష్టకరమన్నారు.
 
తెలుగుదేశ: పార్టీ అధినేత నారా చంద్రబాబును ఏదో ఒకరకంగా బదలాం చేయాలనుకుంటున్నారని మోత్కుపల్లి మండిపడ్డారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చెయ్యాలనే కుట్ర చేస్తున్నారని అన్నారు. ముందు తరాలకు ఆదర్శంగా ఉండాల్సిన సీఎం రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారన్నారని విమర్శించారు. చంద్రబాబుకు  కేసీఆర్ కంటే ఎక్కువ శక్తి ఉందన్నారు. టీడీపీ చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, భయపెట్టి టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారన్నారు. రాజకీయాన్ని కేసీఆర్‌ మలినం చేస్తున్నారన్నారు. ప్రతీ పాపానికి కారకుడు సీఎం కేసీఆరే అని ఆరోపించారు. క్రిమినల్స్‌పైనే ప్రభుత్వాలు ఫోన్‌ట్యాపింగ్‌ చేశాయే తప్ప ప్రజాప్రతినిధులపై ఫోన్‌ట్యాపింగ్‌ చేసిన ఉద్దంత ఎక్కడా లేదన్నారు. ఒక ముఖ్యమంత్రి ఫోన్‌ను ట్యాపింగ్‌చేసే అధికారం ఎవరిచ్చారని మోత్కుపల్లి ప్రశ్నించారు. కేసీఆర్‌ నిరంకుశ విధానానికి ఇది నిదర్శనమన్నారు.10ఏళ్లుగా సీఎం పదవిలో ఉన్నా సీఎం చంద్రబాబు ఇలాంటి నీచమైన పనులు చేయలేదని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం మొత్తం కేసీఆర్‌ కుటుంబం చుట్టూ తిరుగుతుందే తప్ప ప్రజల కోసం కాదని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మహిళలకు, మాలమదిగలకు అవకాశమే లేదన్నారు. ఇప్పటికైనా చంద్రబాబుతో కలిసి రాష్ర్టాన్ని అభివృద్ధి చేయాలని...ఇరురాష్ర్టాల ప్రయోజనాలను కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. కేసీఆర్‌ భాష, పంతాన్ని మార్చుకోవాలని మోత్కుపల్లి హితవు పలికారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Mothkupally narsimlu  Telangana  Ap  Chandrababunaidu  Tapping  

Other Articles