RGV, Ramgopalvarma, Twitter, Hitler, Osamabin laden

Ramgopal varma posts osamabin laden and hitler photos in his twitter

RGV, Ramgopalvarma, Twitter, Hitler, Osamabin laden

Ramgopal varma posts Osamabin laden and hitler photos in his twitter. This innocent cute kid called Hitler unleashed violence on a scale unseen before or after and hopefully never rgv said.

ఆర్జీవీ ఎవరి ఫోటోలు పెట్టాడో తెలుసా.?

Posted: 06/16/2015 01:05 PM IST
Ramgopal varma posts osamabin laden and hitler photos in his twitter

రామ్ గోపాల్ వర్మ.. సినిమాల కన్నా వివాదాలతో బాగా ఫేమస్ అయిన డైరెక్టర్. ఓటుకు నోటు వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల మధ్య సాగుతున్న వివాదంపై, చంద్రబాబు నాయుడు మీద విమర్శలు గుప్పించారు వర్మ. ఆంధ్రా సౌరుడిగా తాను చంద్రబాబు వైఖరిపై విసుక్కుంటున్నానని, చంద్రబాబు నాయుడు విసుగు తెప్పిస్తున్నారని అలాగే కేసీఆర్ ముక్కు సూటితనానికి తాను ఫిదా అయిపోయానని కూడా ట్వీట్ చేశారు. అయితే తాజాగా కొంత మంది వ్యక్తుల ఫోటోలు తన ట్విట్టర్ ఎకౌంట్ లో పెట్టి వార్తల్లో నిలిచారు. హిట్లర్, ఒసామిబిన్ లాడెన్ ల ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చెయ్యడమే కాకుండా వాటి కింద కామెంట్లు కూడా పోస్ట్ చేశారు.

ఇక్కడ క్యూట్ గా కనిపిస్తున్న ఈ బాలుడు పెరిగి పెద్దవాడయ్యి 60 మిలియన్ల మంది మరణాలకు కారణమవుతాడని మనం ఊహించగలమా.. అతడి పేరు అడాల్ఫ్ హిట్లర్ అని వ్యాఖ్య చేశాడు. ఇక లాడెన్ బాలుడిగా ఉన్నప్పటి ఫొటో, యుక్త వయసులో ఉన్న ఫొటో, అతడి పిల్లల ఫొటోలు పెట్టాడు.

rgv-tweets-about-hitler

బాలుడిగా ఉన్నప్పటి ఫొటోపై 'ఈ బాలుడి పేరు ఒసామా బిన్ లాడెన్.. అమెరికాపై యుద్ధం ప్రకటించి పోయి గుహల్లో కూర్చున్నాడు' అని, యుక్త వయసులో ఉన్న ఫొటో పెట్టి 'బ్రూస్లీ నుంచి ఇన్స్పైర్ అయ్యి లాడెన్ కరాటే నేర్చుకున్నాడని, ఇక లాడెన్ ఆరుగురి పిల్లల ఫొటో పెట్టి 'ఈ ఆరుగురు లాడెన్కు ఉన్న 25 మంది సంతానంలో కొందరు. లాడెన్ మనుషులను చంపడమే కాకుండా.. అందుకు భిన్నమైన మరెన్నో ఎన్నో పనులు చేస్తాడని చెప్పేందుకు ఇదొక నిదర్శనం' అని పేర్కొన్నాడు.

 

rgv-tweets-on-osamabin-lade

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RGV  Ramgopalvarma  Twitter  Hitler  Osamabin laden  

Other Articles