Health | Yoga | Diet | Food

A new poetry go viral in social media

Health, Yoga, Diet, Food

a new poetry go viral in social media. Tagores narration Dehamunu presminchumanna style new poetry popular on social media.

దేహమును ప్రేమించుమన్న.. ఆరోగ్యమును పెంచుమన్న

Posted: 06/16/2015 10:52 AM IST
A new poetry go viral in social media

Health is wealth- ఆరోగ్యమే మహా భాగ్యం అని ఓ నానుడి ఉంది. ఎవరు ఎంత కష్టపడి పనిచేసినా, ఎంత సంపాదించినా, ఎంత పేరు తెచ్చుకున్నా కానీ ఆరోగ్యంగా లేకపోతే అవన్నీ దండగే. అందుకే పాతకాలం నుండి నేటి వరకు ఆరోగ్యం మీద దృష్టిసారించాలని పెద్దలు అంటూ ఉంటారు. అయితే మారిన జీవన సంసృతి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ వస్తోంది. ఆరోగ్యకరమైన, పోషకాహారాన్ని తినడం కాకుండా నోటికి రుచిగా ఉంటే, కంటికి ఇంపుగా ఉంటే ఆహారాన్ని తీసుకుంటున్నారు. దాంతో ఆరోగ్యం చెడిపోయి ఆసుపత్రుల పాలవుతున్నారు. అయితే ఎంత ఖర్చు చేసినా కానీ ఆరోగ్యానికి చికిత్స లేకుండా పోతున్న రోగాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అయితే ఆరోగ్యాన్ని ముందు జాగ్రత్తగా చూసుకోండి తర్వాత అన్నీ మీ స్వంత మవుతాయి...లేకపోతే ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేకపోతే గంగలో పోసిన పన్నీరు లాగా అవుతుంది. అందుకే తాజాగా ఓ కవిత ఆరోగ్యాన్ని పెంచుకోండి బాబు అంటూ నాటి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన దేశమును ప్రేమించుమన్నా.. మంచియన్నది పెంచుమన్న అన్న స్టైల్ లో ఉంది.

Yoga


దేహమును ప్రేమించుమన్న మంచి సైజులో ఉంచుమన్న అంటూ.. ఈ మధ్య అధిక బరువుతో బాధపడుతున్న వారిని దృష్టిలో పెట్టుకొని రాశారు
దేహమంటే పొట్టకాదోయ్.. యోగచేసి బాగుపడవోయ్ అంటూ.. ఈ మధ్యన ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ప్యాక్ లు భీభత్సంగా వస్తున్నాయి కాబట్టిి పొట్టను కాస్త తగ్గించేందుకు యోగా చెయ్యండి
వంటపై మీటింగ్ కట్టిపెట్టి గంట వాకింగ్ మొదలెట్టవోయ్.. గంట కొద్ది ఏం వండుకుందామా.. నోటికి రుచిగా ఏం తిందామా అని కాకుండా బాడీకి ఎక్సర్ సైజ్ అయ్యేట్లు గంటసేపైనా వాకింగ్ చెయ్యండి
ఆకు కూరలొ చేవ ఉంది.. చూపు కోసం మంచిదంది.. ఆకు కూరలు తినడం మానేసి చాలాకాలమైంది. ఎప్పుడు చూసినా ఫ్రైలు, రోస్టులే తింటున్నాం. అందుకే ఆరోగ్యాన్ని కాపాడే ఆకుకూరలు తినండి
రేకు టీనులో కోకు కన్నా బోండిమిచ్చే నీరు మిన్నా.. టిన్ బాటిల్ లో ఉండే కోక్ తాగితే అనారోగ్యం వస్తుంది తప్పితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ అదే డబ్బులతో కొబ్బరి బోండాం తాగితే ఆరోగ్యం పదిలం
పిజ్జ బర్గర్ కట్టిపెట్టి ఆవిరిడ్లీ లాగించవోయ్.. ఏం తిందాం అని పిల్లల దగ్గర నుండి ఎవరిని అడిగినా పిజ్జాలు, బర్గర్ లు అనే రోజులు వచ్చేశాయ్. అందుకే వాటిని మానేసి ఆరోగ్యాన్ని కాపాడే ఆవిరిడ్లీలు తినండి
మెట్టు మెట్టు ఎక్కిన అందలం ఆనందం, ఆరోగ్యం పదిలం.. కోటి రూపాలయలనైనా ఒక రూపాయి నుండే లెక్కించినట్లు ఆరోగ్యాన్ని పెంచుకునే అలవాట్లను ఆనందాన్ని ఆరోగ్యాన్ని పదిలం చేసుకోవాలి.మొత్తానికి దేశమును ప్రేమించుమన్నా స్థానంలోనే దేహమును ప్రేమించుమన్నా అంటూ ఆరోగ్య పరిరక్షణను కవితాత్మకంగా వివరించారు.

 

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Health  Yoga  Diet  Food  

Other Articles