Police | attacked | Odisha | Bhubaneshwar

Police attacked by mob in bhubaneshwar odisha

Police, attacked, Odisha, Bhubaneshwar

Police attacked by mob in Bhubaneshwar Odisha. Mob of a slum in Bhubaneshwar attacked on police.

ITEMVIDEOS: నడిరోడ్డుపై ఖాకీలను కుమ్మేశారు

Posted: 06/12/2015 03:50 PM IST
Police attacked by mob in bhubaneshwar odisha

కనిపించని నాలుగో సింహమేరా పోలీస్.. అంటూ తెలుగు సినిమాల్లో డైలాగులు కొట్టే పోలీసులకు బయట ఒకరకమై గుర్తింపు ఉంటుంది. పోలీసుల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిని అడిగితే చెబుతారు పోలీసులు ఎలా ఉంటారో, ఎలా ఉతుకుతారో.  అయితే అదే పోలీసులకు కొడితే.. సారీ కొడితే కాదు కుమ్మితే. ఏంటీ..? పోలీసులను కుమ్మితే అనే ప్రశ్న కూడా ఉంటుందా అని అనుకోకండి. ఒడిశాలో పోలీసులను కుమ్మేశారు కూడా. ఒడిషా రాజధాని భువనేశ్వర్లోని ఓ మురికివాడలో మాత్రం సీన్ రివర్సైంది. జనమే పోలీసుల తాట తీశారు. మామూలు కొట్టుడు కాదు వీర కొట్టుడు....వచ్చిన వాళ్లు పోలీసులన్న విషయం మరిచిపోయిన స్థానిక జనం....బురదలో బొర్లించి....ఉరికించి ఉరికించి కొట్టారు. పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. స్థానికుల దాడితో వణికిపోయిన పోలీసులు బతుకు జీవుడా అంటూ  అక్కడి నుంచి జీపులో పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులపైకి స్థానిక జనం ఇంతలా విరుచుకుపడడానికి పెద్ద కారణమే ఉంది.

Police-attacked-by-mob-03
Police-attacked-by-mob-in-B
Police-attacked-by-mob04
policeattackedbymob02

హల్దీపురా కాలనీలోని ఓ అమ్మాయిని సంతోష్ అనే వ్యక్తి గర్భవతిని చేశాడు. అతనిపై కేసు నమోదు చేయాలని ఎన్నిసార్లు స్టేషన్‌కెళ్లి ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదు. దీంతో నిందితున్ని పట్టుకుని కట్టేసీ తీవ్రంగా కొట్టారు స్థానికులు. ఇది తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాధితున్ని విడిపించే ప్రయత్నం చేశారు. దీంతో, జనాలు తిరగబడ్డారు. ఇక్కడే అసలు రచ్చ మొదలైంది. నిందితున్ని కేసు నమోదు చేయకపోవమేకాక, అతన్ని ఎలా విడిపిస్తారంటూ ప్రశ్నించారు. ముందుగా ఓ పోలీసు మహిళపై చేయి చేసుకోవడంతో....కోపోద్రిక్తులైన జనం పోలీసులకు ఇలా బడితే పూజ చేశారు. మొత్తానికి పోలీసులకు జరిగిన మహాసన్మానం గురించి ఇప్పుడు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలోనూ దీని మీద కామెంట్లు భీభత్సంగా హల్ చల్ చేస్తున్నాయి.

 

*అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Police  attacked  Odisha  Bhubaneshwar  

Other Articles