Chandrababunaidu | Narasimhan | Photo | Delhi | Rajnathsingh

Governor eslnarasimhan pose to photo with ap cm chandrababu naidu

Governor, Chandrababunaidu, Narasimhan, Photo, Delhi, Rajnathsingh

Governor ESLNarasimhan pose to photo with ap cm Chandrababu naidu. The photo goes as news at this movement. Why governor specially pose to photo with chandrababu naidu..? is the question here.

ఏపి సిఎం చంద్రబాబుతో గవర్నర్ ఆఖరు ఫోటో..?!

Posted: 06/11/2015 08:47 AM IST
Governor eslnarasimhan pose to photo with ap cm chandrababu naidu

ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కు కలిగిన ఓ కోరిక ఇప్పుడు అందరికి చర్చనీయాంశంగా మారింది. అవును అది కూడా గవర్నర్, ఏపి సిఎం చంద్రబాబు నాయుడుకు మధ్య జరిగిన ఓ ఇంట్రస్టింగ్ మ్యాటర్ లో భాగంగా కలిగిన కోరిక. ఇంతకీ గవర్నర్ నరసింహన్ కోరిక ఏంటో అనుకుంటున్నారా..? ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఓ ఫోటో దిగాలని గవర్నర్ కోరిక. గత పది రోజులుగా జరుగుతున్న పరిణామాలపై తెలుగు రాష్ట్రాల్లో గవర్నర్ అధికారాలపై చంద్రబాబు పిర్యాదు చెయ్యడానికి హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో గవర్నర్‌ నరసింహన్‌ తన విచక్షణాధికారాలను ఉపయోగించడం లేదంటూ కేంద్రానికి తన వాదన వినిపించేందుకు వచ్చిన సీఎం చంద్రబాబు, గవర్నర్‌ నరసింహన్‌. . ఇద్దరూ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ కా ర్యాలయంలో పరస్పరం ఎదురుపడ్డారు.

అయితే ఇలా ఎదురుపడ్డా వారు ఒకరినొకరు నవ్వుతూ పలకరించుకున్నారు. అయితే అదే సమయంలో చంద్రబాబు నాయుడతో ఫోటో దిగాలని ఉందని.. అక్కడే ఉన్న ఓ ఫోటో గ్రాఫర్ ను పిలిచి ఫోటో తియ్యమని ఫోజులు కూడా ఇచ్చారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మామూలుగానే కాస్త వెటకారం ఎక్కువున్న నరసింహన్ క్యాజువల్ గానే ఫోటో దిగారా.? లేదంటూ చంద్రబాబు నాయుడు సినిమా క్లోజ్ అయిందని నరసింహన్ కు అర్థమైంది కాబట్టి కనీసం చివరి ఫోటో అయినా దిగుదాం అనే ఆలొచనతో ఫోటో దిగారా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మొత్తానికి తన మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన చంద్రబాబు నాయుడతోనే గర్నర్ నరసింహన్ ఫోటో దిగడం వార్తల్లో నిలిచింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Governor  Chandrababunaidu  Narasimhan  Photo  Delhi  Rajnathsingh  

Other Articles