Telangana | ACB | A.K.Khan | Chandrababu

Telangana acb dg a k khan once again highlighted in the media

Telangana, ACB, A.K.Khan, Chandrababu, Revanth Reddy

Telangana ACB DG A.k.Khan once again highlighted in the Media. From last week Telangana ACB arrested the TTDP leader Revanth Reddy.

ఆ ఖాన్ మీటింగ్.. చంద్రబాబుకు పరేషాన్..!

Posted: 06/08/2015 12:28 PM IST
Telangana acb dg a k khan once again highlighted in the media

ఓ ఖాన్ పేరు వింటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెగ క్రేజ్ వచ్చేసింది. అంతకు ముందే అతని పేరు మీడియా అప్పడప్పుడు వార్తల్లోకెక్కారు. అయితే చాలా కాలం తర్వాత ఆ ఖాన్ సాబ్ తన పనితనంతో వార్తల్లో నిలిచారు. ఇంతకీ ఆ ఖాన్ ఎవరూ అనుకుంటున్నారా.? ఇంకెవరు ఏకే ఖాన్. ప్రస్తుతం తెలంగాణ ఏసీబీ డిజిగా పని చేస్తున్న ఏకే ఖాన్ పర్యవేక్షణలోనే రేవంత్ రెడ్డి ఎపిసోడ్ నడిచింది. తర్వాత ఖాన్ రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు. అలా రేవంత్ రెడ్డి వ్యవహారంతో మరోసారి వార్తల్లో హైలెట్ గా నిలిచారు ఏకే ఖాన్. అయితే తాజాగా చంద్రబాబు నాయుడుకు సంబందించిన ఆడియో టపులు విడుదల కావడంతో చంద్రబాబు నాయుడుతో పాటు అతని అనుచరులకు కూడా తలనొప్పి మొదలైంది. అయితే కొద్దిసేపటి క్రితం ఏకే ఖాన్ అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేవారు. దాంతో సర్వత్రా ఏకే ఖాన్ మీటింగ్ గురించి చర్చించుకుంటున్నారు.

ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ సిఎం నారా చంద్రబాబు నాయుడు ఆడియో టేపులు విడుదల కావడం తెలుగు రాష్ట్రాల్లో దుమారాన్నే రేపుతున్నాయి. అయితే ఈ ఆడియో టేపుల మీద దృష్టిసారించింది తెలంగాణ సర్కార్. అందులో భాగంగానే తెలంగాణ ఏసీబీ డీజి ఏకే ఖాన్ తన శాఖాధిపతులు, న్యాయనిపుణులతొ అత్యవసరంగా భేటీ అయ్యారు. చంద్రబాబు నాయుడు ఆడియో టేపులకు సబందించి తరువాత ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అంటూ వారు చర్చిస్తున్నట్లు సమాచారం. న్యాయనిపుణులు సలహా తీసుకున్న తర్వాత చంద్రబాబు, స్టీఫెన్ సన్ కు నోటీసులు జారీ చెయ్యాలి అన్న ఆలోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. మరి భేటీ తర్వాత ఏకే ఖాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  ACB  A.K.Khan  Chandrababu  Revanth Reddy  

Other Articles