Petealasujata, cash bag, money

Ap minister petela sujata cash bag issue got new twist

Petealasujata, cash bag, money

Ap Minister Petela Sujata cash bag issue got new twist. The Minister complaints about the cash bag in her bag.

"పీతల వారింట్లో నోట్ల మూట" సినిమా

Posted: 06/03/2015 11:51 AM IST
Ap minister petela sujata cash bag issue got new twist

ఒకప్పుడు సినిమా రిలీజ్ అంటే భారీ క్రేజ్ అందుకే మైక్ లలో చూడండి బాబూ చూడండి నేడే చూడండి అంటూ ఎనౌన్స్ మెంట్ లు ఇచ్చే వారు. అయితే తాజాగా ఓ రాజకీయ సినిమా గురించి కూడా జనాలకు తెలియడానికి అదే తరహా ప్రచారం చెయ్యాలేమో. ఏపి మంత్రి పీతల సుజాత ఇంట్లో ప్రత్యక్షమైన నోట్ల కట్టలతో కూడిన బ్యాగ్ పై కొత్త కొత్త అనుమానాలు రేకెతుతున్నాయి. తన ఇంట్లకి వచ్చిన నోట్ల బ్యాగ్ గురించి పీతల సుజాత ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తును ప్రారంభించారు. పీతల సుజాత ఇంటికి వచ్చిన మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.

అయితే పీతల సుజాత ఇంట్లో నోట్ల కట్టల విషయమై సదరు మహిళను ప్రశ్నిస్తే తన మనమరాలి పెళ్లి కోసం తీసుకువచ్చిన డబ్బులు అని చెప్పింది. కానీ ఆమె కూతురు మాత్రం స్థలం కొనడానికి డబ్బులు డ్రా చేశామని తెలిపింది. దాంతో పీతల ఇంట్లో నోట్ల మూటలు సినిమాలో కొత్త ట్విస్టుకు తెర లేచింది. అయితే సుజాత కూడా పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చిందని చెప్పింది. కానీ స్థలం కొనడానికి అన్న సమాధానమే ఇప్పుడు కొత్త మలుపు తిప్పుతోంది. మరి పీతల వారింట్లో నోట్ల కట్టల మూటలు అన్న సినిమాకు ఎలాంటి ఎండ్ కార్డ్ పడుతుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petealasujata  cash bag  money  

Other Articles