Revanth reddy | TDP | ACB | Video | Telangana | Stephen

Telangana tdp party senior leader reveanth reddy arrested by acb officials yesterday

Revanth reddy, TDP, ACB, Video, Telangana, Stephen

Telangana TDP party senior leader reveanth reddy arrested by acb officials yesterday. ACB officials reveal the video of conversation between revanth reddy and stephen.

ITEMVIDEOS: రేవంత్ రెడ్డి లంచావతారంపై ఏసీబీ వీడియో ప్రూఫ్

Posted: 06/01/2015 07:45 AM IST
Telangana tdp party senior leader reveanth reddy arrested by acb officials yesterday

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు కొత్త రాజకీయాలకు తెర తీస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ సినయర్ నాయకుడు రేవంత్ రెడ్డి ఓ ఎమ్మెల్యేకు ఎర వెయ్యబోయి.. స్వయంగా తానే చిక్కుకున్నారు. ఐదు కోట్ల రూపాయల డీల్ కుదిరిన ఈ ఆపరేషన్ లో రేవంత్ రెడ్డి అడ్డంగా బుక్ అయ్యారు. సికింద్రాబాద్లోని లాలాగూడలో స్టీఫెన్కు రేంవత్ రెడ్డి 50 లక్షల రూపాయలు ఇస్తుండగా పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. పలుకుబడి ఉన్న రాజకీయ నేత కాబట్టి ఖచ్చితంగా వివాదమవుతుందని ఏసీబీ సాక్షాలతో సహా రేవంత్ ను అరెస్టు చేసింది. రేవంత్ రెడ్డి, స్టీఫెన్ ల మధ్య జరిగిన డిస్కషన్స్ ను వీడియో తీసి మీడియాకు విడుదల చేసింది ఏసీబీ.

రేవంత్‌: నాకు మీ సహాయం కావాలి.. మీ మద్దతు కావాలి. అందుకే మీతో మాట్లాడడానికి వచ్చాను. మీకు ఏది కావాలంటే అది. చంద్రబాబుగారితో మాట్లాడతాను. అంతా రహస్యంగా ఉంటుంది. బయటకు రావాల్సిన అవసరం ఉండదు.

స్టీఫెన్‌: మీరు కచ్చితంగా ఏం కోరుకుంటున్నారు? ఏమిస్తారు?

 
రేవంత్‌: మీరే అడగండి.

స్టీఫెన్‌: అది మీరే చెప్పాలి! ఎందుకంటే లైఫ్‌ టైం రిస్క్‌ కదా?

రేవంత్‌: అవును! రాజకీయంగా అది వేరే విషయం. అయినా ఇది ఐదు కోట్ల డీల్‌. బాసే నన్ను ఆపరేట్‌ చెయ్యమన్నారు. నేను ఇంత దూరం వచ్చానంటే మాకు క్లారిటీ ఉంది. ఫిక్స్‌ చేసింది రెండున్నర. మీరు నంబర్‌ చెబితే బాబుతో మాట్లాడతాను.

స్టీఫెన్‌: రెండు రెండున్నర అంటే తక్కువేమో కదా?
 
రేవంత్‌: అందుకే.. మీరు ఓ సంఖ్య చెబితే నేను బాబుతో మాట్లాడతాను. నాకు ఓ హద్దు ఇచ్చారు అంతవరకు మాట్లాడాను. మీరు ఏదైనా చెబితే ఆయనతో అడిగి మళ్లీ మీ దగ్గరకు వస్తా. బాబు ఏం హామీ ఇచ్చినా రెండు గంటల్లో అమలవుతుంది.

స్టీఫెన్‌: మా పార్టీకి తెలుస్తుందా?
 
రేవంత్‌: దాదాపు అసాధ్యం. ఎందుకంటే టీఆర్‌ఎస్‌కు 83 మంది మద్దతుంది. కాబట్టి 17 మంది చొప్పున నలుగురికి కేటాయిస్తారు. మిగిలిన 15మందిని ఐదో వ్యక్తికి కేటాయిస్తారు. ఇలా జరిగిన కేటాయింపుల్లో మీ ఓటును ఒక వ్యక్తికి కేటాయిస్తారు. ఉదాహరణకు తుమ్మల నాగేశ్వరరావుగారికి మిమ్మల్ని కేటాయించారనుకుంటే ఆయనకు కేటాయించిన 17 మందిలో మీరూ ఒకరు అవుతారు. మిమ్మల్ని ఎవరికి కేటాయించారనేది పోలింగ్‌ జరిగే ఉదయానికి కానీ తెలిసే అవకాశం ఉంది. ఆ 17 మందిలో ఎవరో ఒకరు ఓటు వేయలేదనేది తెలుస్తుంది. ఆ అభ్యర్థికి 16 ఓట్లే వచ్చే అవకాశం ఉంది. కానీ, కచ్చితంగా ఎవరు వేయలేదనేది తెలియదు. మా వాళ్లను కూడా వాళ్లు వర్క్‌అవుట్‌ చేస్తున్నారు. ఉదాహరణకు, మాధవరం కృష్ణారావు మనకే వేస్తానంటున్నాడు. కానీ కాన్ఫిడెన్స్‌ రావడం లేదు. అందుకే రిస్క్‌ తీసుకోదలచుకోలేదు. వాళ్ల దాంట్లో ముగ్గురు మాతో టచ్‌లో ఉన్నారు. అయితే వారు ఎవరికి వేస్తారో తెలియదు. అయినా ఒక సీటుతో మాకు వచ్చింది లేదు పోయింది లేదు. కానీ, చంద్రబాబు వర్సెస్‌ కేసీఆర్‌ అనే ప్రిస్టేజ్‌ వచ్చిందికాబట్టే గేమ్‌ మొదలైంది. తెలంగాణలో ప్రస్తుతమున్న రాజకీయాల్లో టీడీపీలో నేనో ముఖ్య నేతను. అందుకే బాస్‌ కూడా నా మాటను పరిగణనలోకి తీసుకుంటారు. నా మాట మీదే నరేందర్‌ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. ఏపీలో నామినేటెడ్‌ సీటు భర్తీ చేయలేదు. మీకు ఇక్కడ ఏమైనా సమస్యలొస్తే.. డైరెక్ట్‌గా బాస్‌ దగ్గర కూర్చోబెట్టి అక్కడ సీటు కేటాయించాలని చెబుతాను. నేను బాస్‌తో మాట్లాడి విషయం చెబుతాను.
 
మీకు ఓ నమ్మకం కలగడానికి.. మీరు ఇమ్మంటే కొంతసొమ్ము ఇక్కడే ఇచ్చేస్తాను. మిగిలినది కూడా ఎక్కడో ఓ కామన్‌ పాయింట్‌ అనుకుంటే అక్కడ ఇచ్చేస్తాను. నా గురించి మీకు తెలుసు. మహానాడులోనే నన్ను పార్టీ అధ్యక్షుడిగా చేస్తానన్నారు. వ్యక్తిగత బాధ్యతలవల్ల వద్దన్నా. నాయుడుగారికి ఏపీలో చాలా బాధ్యతలున్నాయి. ఢిల్లీ రాజకీయాలపైనా దృష్టిపెడుతున్నారు. అందుకే తెలంగాణలో ఆయన నామీద నమ్మకముంచారు. తెలంగాణలో రెడ్లు చాలా ఉన్నారు. అక్కడైతే రెడ్లను సార్‌ క్యారీ చేయలేరు. ఎందుకంటే బాబు వర్సెస్‌ జగన్‌ ఉంది. కాబట్టి అక్కడ అకామడేట్‌ చేయలేరు. ఇప్పుడు తెలంగాణలో రెడ్డీస్‌కు ఇవ్వాలనే ఆలోచిస్తున్నారు. మాకు దీనిపై అంతర్గత సందేశాలున్నాయి. నేనే దీనికి బాధ్యత తీసుకుంటా. రెడ్డి కులస్థులు ముఖ్యమంత్రి కుర్చీ తమదే అనుకుంటారు. ఎవర్నైనా దించారు అంటే కుర్చీ మాదే అనుకుంటారు. ఇప్పుడు అకస్మాత్తుగా మూడోది ప్రవేశించింది. సీమాంధ్రలోని రెడ్డిలు కృష్ణా, గుంటూరులో ఏమీ చేయలేరు. చాలా మంది హైదరాబాద్‌లో సెటిలయ్యారు. నెల్లూరు, ప్రకాశం, కర్నూల్‌, కడప, చిత్తూరు ఇలా ఆరు జిల్లాలకు చెందిన వారంతా ఇక్కడే ఉన్నారు. వాళ్లంతా కేసీఆర్‌తో అప్రోచ్‌ ఉంటారు. ఒకటి ఆంధ్రా. రెండోది రెడ్డి. ఇటు తెలంగాణలోగానీ, ఆంధ్రాలోగానీ, టీడీపీకి గానీ, ఇక్కడ మనం ఉంటేనే బిజినెస్‌ పరంగా బాగుంటుంది. కమ్మ వాళ్లకు కూడా తెలంగాణలోనే బిజినెస్‌లు ఉన్నాయి. రాజకీయాల్లో నాకింకా వయసుంది. ఇంకా 25 ఏళ్ల వరకు ఉంటాను. కాంగ్రెస్‌ ఇప్పుడు పడిపోయినందున.. (పక్కనుంచి స్టీఫెన్‌.. జానారెడ్డి హవా అయిపోయింది) జైపాల్‌రెడ్డిగారు, జానారెడ్డి గారు ఫ్లాగ్‌ఎండ్‌ పాలిటిక్స్‌లో ఉన్నామన్న ఆలోచనతో నన్నే ప్రమోట్‌ చేస్తాముంటున్నారు. వాళ్లందరూ 70ల్లో ఉన్నారు. వారి పిల్లలు 30ల్లో ఉన్నారు. నేను 40ల్లో ఉన్నా.. మిడిల్‌లో ఉన్నా. వాళ్ల పిల్లలు నిలదొక్కుకోవాలంటే మమ్మల్ని సపోర్ట్‌ చేయాలి. అంటే ఇప్పుడు వాళ్ల పిల్లలు రాజకీయాల్లోకి రాలేదు. వీళ్లేమో రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నారు.

స్టీఫెన్‌: ఒకవేళ ఏదైనా జరిగితే మా కోసం మీరేం చేస్తారు? మీరు మాకేం ఇస్తారు? దానికి మీకేం కావాలి?
 
రేవంత్‌: ఒకవేళ ఇక్కడ ఏదీ దొరకపోతే ఏపీలో ఇప్పిస్తా.

స్టీఫెన్‌: ఆంధ్రప్రదేశ్‌ కన్నా ఈ దిక్కుకు వస్తే బాగుంటుంది?
 
రేవంత్‌: ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కాబట్టి ఏం చేయలేం. కేంద్రంలో అయితే ఏదో ఒకటి చేయొచ్చు. లేకుంటే ఆంధ్రా. నేనే ఇప్పుడు డైరెక్టుగా వచ్చినా నాకు పరిస్థితేంటో తెలుసు. ఒకవేళ రేపొస్తే.. అది భవిష్యత్తు. అర్జెంటుగా అంటే ఏపీలో గానీ, సెంట్రల్‌లో గానీ ఏదైనా చేయగలుగుతాం. నేను బాస్‌తో మాట్లాడి కన్ఫర్మ్‌ చేస్తా. మీరు ఒక్కసారి లేట్‌నైట్‌ అయినా బాస్‌తో కలిస్తే...

స్టీఫెన్‌: మీరు కన్ఫర్మ్‌ చేయండి. ఉదయం కలుద్దాం సార్‌ని.

 
రేవంత్‌: బాస్‌తో ఫోన్లో మాట్లాడిస్తాం. ఇక్కడ రెండు విషయాలు. ఒకటి.. నంబర్‌, రెండోది.. ఒకవేళ తెలంగాణలో సర్దుబాటులో సమస్య ఉంటే ఏపీలో ఇప్పించే దానిపై మాట్లాడతాం. మీరు డైరెక్ట్‌గా పోయి ప్రపోజల్‌ పెట్టండి. మేం వస్తాం. వెయిట్‌ చేస్తాం.

స్టీఫెన్‌: మీరు కన్ఫర్మ్‌ చేస్తే..
రేవంత్‌: నేను సార్‌తో మాట్లాడి చెప్తా..
 
ఇప్పుడు రూ.50 లక్షలు!.. కౌంటింగ్‌ ముగిశాక 4.5 కోట్లు
అంతకుముందే ఒక భేటీ ముగిసింది. ఆదివారం లాలాగూడలోని స్టీఫెన్‌ కుమారుడి ఇంటికి రేవంత్‌, మరో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. నగదు ఇచ్చారు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన సంభాషణ ఇది...
 
స్టీఫెన్‌: మనం విషయాలను స్పష్టంగా మాట్లాడుకుందాం? ఇప్పుడు మీరు ఏమిస్తున్నారు?
రేవంత్‌: ఇప్పుడు 50 ఇస్తున్నాం. మిగిలిన 4.5 రేపు.. ఒక పర్సన్‌ మీరు చెప్పిన ప్లేస్‌కు వచ్చి... (అని చెబుతుండగానే..)
 
స్టీఫెన్‌: 4.5 అంటే?
రేవంత్‌: 4.5 కోట్లు క్యాష్‌. మొత్తం రూ.5 కోట్లు. ఇప్పుడు రూ.50 లక్షలు ఇస్తున్నాం. మిగిలింది రూ.4.5 కోట్లు కౌంటింగ్‌ ముగిశాక ఇస్తాం. మీ ఇంట్లో వద్దు. మరో చోట ఎక్కడైనా చెప్పండి.
 
స్టీఫెన్‌: కోడ్‌ ఏమిటి?
రేవంత్‌: అది రాత్రి 9.30 గంటలకల్లా చెప్పేస్తాం. ఇక్కడ ఏం జరిగినా... మిమ్మల్ని ఏపీలో నామినేట్‌ చేస్తాం. ఎలాంటి పని ఉన్నా చెప్పండి. రేపు మీ పర్సన్‌ను కూడా తెచ్చుకోండి. (డబ్బులు బయటికి తీసేముందు...) డోర్‌ లాక్‌ చేసేయండి..
 
స్టీఫెన్‌: అబ్బే అవసరం లేదు. ఎవరూ రారు!
రేవంత్‌: అయినా... చాన్స్‌ (రిస్క్‌) తీసుకోవద్దు.
 
స్టీఫెన్‌: (నవ్వారు. మిగిలిన మొత్తం చెల్లింపునకు సంబంధించి కొంత వివరణ అడిగారు.)
రేవంత్‌: రేపు (సోమవారం) సెబాస్టియన్‌, మరో వ్యక్తి కలిసి కోఆర్డినేట్‌ చేస్తారు. ఎందుకంటే, నేను అసెంబ్లీలో ఉంటాను. (రేవంత్‌ వెంట వచ్చిన వ్యక్తి బ్యాగ్‌ నుంచి నోట్ల కట్టలు తీసి పెడుతుండగా..)
 
రేవంత్‌: నావైపు నుంచి అంతా క్లియర్‌గా ఉంది. నా పని నేను చేశాను. ఎలాంటి అస్పష్టత లేదు. ఇది బాస్‌కు నా వ్యక్తిగత జవాబుదారీ. మీరు రేపు అసెంబ్లీకి వచ్చి మా అభ్యర్థికి ఓటు వేయండి.

(Source: ABN Andhrajyothy)

 

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth reddy  TDP  ACB  Video  Telangana  Stephen  

Other Articles