A Medicine Student named mahammad owaisi makes a kidnap drama to skip exams | Kidnap Dramas

Uttar pradesh sitapur medicine student kidnap drama to escape from exams

mahammad owaisi kidnap drama, medicine student kidnap drama, students kidnap drama, kidnap stories, uttar pradesh crime stories, uttar pradesh police, lucknow crime news

Uttar Pradesh Sitapur Medicine Student Kidnap Drama To Escape From Exams : A Medicine Student named mahammad owaise makes a kidnap drama to skip exams In lucknow where he took coaching classes of medicine.

మెడిసిన్ విద్యార్థి కిడ్నాప్... కథ!

Posted: 05/29/2015 06:11 PM IST
Uttar pradesh sitapur medicine student kidnap drama to escape from exams

తమ కోరిన కోరికలు నెరవేరకపోతే యుక్తవయస్సులో వున్నవారు రకరకాలుగా తమ ఈగోని ప్రదర్శిస్తుంటారు. కోరికలు నెరవేర్చకుంటే ఆత్మహత్య చేసుకుంటామని కుటుంబసభ్యులు భయపెట్టడం, దొంగతనాలకు పాల్పడటం, డబ్బులకోసం ఇతర దొడ్డుదార్లు వెతుక్కోవడం, ఇష్టంలేని పనిచేయిస్తే దాన్నుంచి తప్పించుకోవడం కథలు అల్లడం.. ఇలా ఎన్నో విధాలుగా తమ తెలివి చూపిస్తారు. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే.. ఓ విధ్యార్థి కూడా ఈ తరహాలోనే ఒక కథ అల్లేసి.. అల్లకల్లోలం సృష్టించాడు. మెడిసిన్ చేయడం ఇష్టంలేని ఓ విద్యార్థి.. కిడ్నాప్ కథ అల్లాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ కి చెందిన మహ్మద్ ఒవైసీ అనే విద్యార్థిని మెడిసిన్ కోచింగ్ నిమిత్తం అతని తండ్రి లక్నోలోని ఓ హాస్టల్ లో జాయిన చేయించాడు. మెడిసిన్ చేయడం ఇష్టం లేకపోయినప్పటికీ... తండ్రి ఒత్తిడి మేరకు కొన్నాళ్లపాటు కోచింగ్ తీసుకున్నాడు. అయితే.. మరో రెండు రోజుల్లో మెడిసిన్ ఎంట్రీన్స్ పరీక్ష వుందనగా.. ఈ కుర్రాడు మే 22వ తేదీ నుంచి హాస్టల్ లో కనిపించకుండా పోయాడు. ఒక్కసారిగా తమ కుమారుడు మాయమవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు.. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. తర్వాతి రోజు నుంచి వేర్వేరు సిమ్ కార్డులతో కిడ్నాపర్ల నుంచి అతడి తల్లిదండ్రులకు ఫోన్ వచ్చేది. అయితే.. ఈ విధంగా ఫోన్ కాల్స్ రావడం పోలీసులకు విచారణ చేపట్టేందుకు కాస్త లైన్ క్లియర్ అయ్యేటట్లు చేశాయి.

రకరకాల సిమ్ కార్డుల నుంచి ఫోన్ కాల్స్ రావడంతో పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. చివరకు ఆ బాలుడి ఆచూకీని కనుగొన్నారు. అయితే.. అప్పుడే అందరికీ షాక్ తగిలేలా ఈ కిడ్నాప్ ఉదంతం తెలిసింది. ఆ బాలుడిని ఎవరూ కిడ్నాప్ చేయలేదని, మెడిసిన్ చదవడం ఇష్టం లేకపోవడంతో ఆ బాలుడే కిడ్నాప్ డ్రామా ఆడినట్లు వారు వెల్లడించారు. ఫోన్ కాల్స్ ఆధారంగా అతనిని మొరాదాబాద్ లో పట్టుకున్నట్లు పోలీసులు వివరించారు. ఆ బాలుడు ఈ కిడ్నాప్ డ్రామా కోసం 23 వేర్వేరు సిమ్ కార్డులు వినియోగించినట్లు పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahammad owaisi  kidnap drama  medicine students  

Other Articles