chandrababu | not explained about election promises | mahanadu programme | Political news | TDP

Why chandrababu could not explained about election promises in mahanadu

chandrababu naidu, mahanadu programme, tdp party updates, chandrababu naidu controversies, elections promises, chandrababu elections promises, ap capital city news, ap capital donations, ap capital updates, ap capital amaravati plan, tdp mahanadu, mahanadu 2015, NTR, balakrishna, pavan Kalyan, power star pavan kalyan, PK, nara lokesh, hari krishna, Jr NTR

chandrababu | not explained about election promises | mahanadu programme | Political news | TDP

ITEMVIDEOS: ఏడాది గడిచినా.. ఎన్నికల హామీపై ఎటూ తే్ల్చుకోలేని బాబు.!

Posted: 05/28/2015 03:36 PM IST
Why chandrababu could not explained about election promises in mahanadu


ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో నిష్ణాతుడని విపక్షాలు విమర్శలు చేస్తున్నా.. పట్టించుకోని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.. గండిపేటలో మహానాడును ఏర్పాటు చేయడం.. తన రెండు కళ్ల సిద్దంతంపై క్లారిటీ ఇవ్వడానికేనని తెలుగు తమ్ముళ్లకు అర్థమైయ్యింది. ఏడాది గడిచినా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయడని తమను ప్రజలు అడుగుతున్నారని.. వాటిపై తమ అధినేత క్లారిటీ ఇస్తారనుకుంటే..ఇంకా తన రెండు కళ్ల సిద్దాంతంపై వేదాంతం మాట్లాడుతున్నారని వారు విస్తుపోతున్నారు. మహానాడు వేదికగా ఆంధ్రప్రదేశ్ విఫక్ష పార్టీ వైసీపీ, చచ్చిన పాములా పడివున్న కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూ.. రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగిందని.. ఏడాది కాలంపైగా వినిపిస్తున్న పాత బాధను.. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా చంద్రబాబు తన అవేదననే వినిపించడంపై చెవులు కోరుకుంటున్నారు.

కేంద్రంలో తన మిత్రపక్షం పార్టీ బీజేపి నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలో కొనసాగుతూ ఏడాది గడుస్తుంది. అయితే ఏడాదిగా కేంద్ర సహకారంతో ఏం చేశారన్నది మాత్రం బాబు తెలుగు తమ్ముళ్లకు చెప్పడంలో విఫలమయ్యారు. ఆంద్రప్రదేశ్ రాజధాని నిర్మాణాన్ని విజయవాడ, గుంటూరు వంటి ప్రభుత్వ భూమి లేని, జనసాంధ్రత అధికంగా వున్న ప్రాంతంలో నిర్మించరాదని సూచించిన శివరామకృష్ణన్ కమిటీ నిర్ణయాలను తోసిరాజి అక్కడే ఎందుకు నిర్మిస్తున్నారొ చెప్పడంలోనూ చంద్రబాబు విఫలమయ్యారు. తన పార్టీలో బంధుప్రీతికి, అవినీతికి స్థానం లేనది గాంభీరంగా చెప్పే బాబు.. అక్కడే రాజధానిని ఎందుకు చేపట్టాలని నిశ్చయించుకున్నారో తెలుగు తమ్ముళ్లకు చెప్పలేక పోయారు.

రాజధాని ల్యాండ్ పుల్లింగ్ ద్వారా భూములిచ్చిన రైతులకు ధన్యావాదాలు చెప్పిన చంద్రబాబు.. భూములిచ్చేది లేదని తేల్చిచెప్పిన రైతులకు ఎలా న్యాయం చేస్తారన్న విషయాన్ని వివరించడంలోనూ చంద్రబాబు పూర్తిగా మర్చిపోయారు. వారి భూములను భూ సేకరణ చట్టం ద్వారా తీసుకుంటామని చెబుతూ నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయాల్సి వచ్చిందో కూడా చంద్రబాబు వివరించలేకపోయారు. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటి వరకు ఎందురు విరాళాలు ఇచ్చారు. ఇతర ఎన్జీవో ద్వారా ఎన్ని నిధులు వచ్చాయి.. వాటిలో ఎంత ఖర్చయ్యాయన్న వివరాలను కూడా చంద్రబాబు చెప్పలేదు. అది చాలదన్నట్లు ఒ వైపు విరాళాలను సేకరిస్తూనే.. విదేశీ పర్యటనలను చేస్తూ ప్రజా ధనాన్ని దుబారాగా ఖర్చు చేస్తున్నారని వస్తున్న విమర్శలపై ఎలా తిప్పి కోట్టాలన్న విషయాన్ని కూడా చంద్రబాబు తెలుగు తమ్ముళ్లకు విషధీకరించలేదు.

రాష్ట్రం విడిపోయి ఏడాది కావస్తున్నా.. ఇంకా తెలంగాణ రాష్ట్రంపై కారాలు మిరియాలు నూరుతూ.. తనదైన శైలిలో విమర్శలను ఎక్కుపెడుతున్న చంద్రబాబు.. కేవలం ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే తెలుగువారి మధ్య విద్వేషాలను రెచ్చగోడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర పునర్విభజన జరిగి ఏడాది కావస్తున్నా.. తెలంగాణలో ఎక్కడా సీమాంధ్ర ప్రాంతవాసులపై ఎలాంటి విపరీత చర్యలు జరగలేదు. అయినా ఇంకా చంద్రబాబు తెలంగాణను బూచిలా చూపి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శలు రేకెత్తుతున్నాయి. తన ఎన్నికల హామీలను ఎప్పడు నేరవేరుస్తారు.

వ్యవసాయం లాభసాటిగా ఎప్పుడు మారుస్తారు..? డ్రిఫ్, స్ప్రింకిల్ ఇరిగేషన్ పథాకాలతో ఏడాదిలో ఎందరి రైతులకు మేలు చేశారు..? ఇంటికో ఉద్యోగం ఎప్పడిస్తారు..? నిరుద్యోగులకు నెల నెలా నిరుద్యోగ భృతి ఎప్పుడు కల్పిస్తారు..? డ్వాక్రా మహిళలకు ఎప్పడు రుణాలు మాఫీ చేయిస్తారు..? రైతులకు రుణాలను పూర్తిగా ఎప్పుడు మాఫీ చేస్తారు..? విద్యుత్ కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా ఎప్పడిస్తారు..? నవ్యాంధ్రలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అడావారిపై రోజుకో అఘాయిత్యం జరుగుతూనే వుంది..? వారికి ఎప్పడు రక్షణ కల్పిస్తారు..? పేదలకు లక్ష యాభై వేల రూపాయలతో ఇత్యాది తన హామాలన్నింటినీ ఎప్పుడు నెరవేరుస్తారు..?

అసలు వాటి కోసం ప్రణాళికలు సిద్దం చేశారా..? అయితే వాటిని తెలుగు తమ్ముళ్లకు వివరించే దెప్పుడు..? వారు ప్రజలకు చెప్పేదప్పడు. ఇప్పటికే ఐదేళ్ల కాలంలో చూస్తుండగానే ఏడాది గడిచింది. ఇక మిగిలింది మరో నాలుగేళ్లు. ఈ నాలుగేళ్ల కూడా బాబు ధ్యాసంతా కేంద్ర ప్రభుత్వాన్ని మచ్చిక చేసుకుని అందిన కాడికి నిధులు రాబట్టుకోవడంపైనే వుంటుందా..? రాజధానిని నిర్మించడంపైనే వుంటుందా..? లేక ప్రజా సమస్యలపై వుంటుందా..? పోలవరం, వట్టిసీమ వంటి ప్రాజెక్టులను కూడా ఆయన పూర్తి చేయగలరా..? విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ తీసుకురాగలరా..? లేక మసి పూసి మారేడుకాయను చేస్తారా..? వేచి చూడాల్సిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  mahanadu  election promises  

Other Articles