Teenage girl abducted | Gangraped | killed | Telangana | Father |

Teenage girl raped killed by father at bantwaram

Teenage girl abducted in Telangana, Teenage girl Gangrape in Telangana, Teenage girl killed in Telangana, Telangana, crime in Telangana, violence against woman, crime against woman, Teenage girl abducted, killed in Telangana, news, India news, crime in rangareddy, Ranga Reddy District Superintendent of Police M Srinivas, Bantaram Police Station Sub-Inspector Ravinder,

A 15-year-old girl student was allegedly raped and killed by father in Ranga Reddy district of Telangana, police said today

బంట్వారం బాలిక అత్యాచారం, హత్య కేసులో కీలక మలుపు

Posted: 05/23/2015 04:50 PM IST
Teenage girl raped killed by father at bantwaram

రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న మైనర్ బాలిక అత్యాచార, హత్య కేసులో కీలక పలుపు చోటుచేసుకుంది. మైనర్ బాలికను కిడ్నాప్ చేసి ఐదుగురు అటో డ్రైవర్ లు అత్యాచారం చేసి, హత్య చేశారన్న కేసుగా నమోదైన ఈ కేసులో తండ్రే మెకావత్ కమాల్ కాలయముడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఘటన జరిగిన అనంతరం పోలీసులు చెప్పిన విషయాలకు, తనను విచారిస్తున్న సమయంలో వెల్లడించిన బాలిక తండ్రి మెకావత్ కమాల్ లే దోషిగా నిర్థారించారు. తండ్రితో కలసి బయటకు వెళ్తున్నానని ధైర్యంగా, సంతోషంగా వెళ్లని ఆ చిన్నారికి తన తండ్రే తన పాలిట కాలయముడవుతాడు.

తన బాబాయి ఇంటిలో ప్రశాంతంగా నిద్రపోతున్న బాలిక తండ్రితో వెళ్తున్నాననే ఇంట్లో నిద్రపోతున్నామని తెలియదు అమెకు చివరి రోజు అవుతుంది. తన తండ్రే తనపై కామవాంఛతో తెగబడి.. తనను హతమారుస్తారని, అయితే అత్యంత అమానవీయంగా.. సభ్య సమాజం తలదించుకునేలా తండ్రే కన్నకూతుర్ని కాటువేశాడు. కూతురిపై అత్యాచారం చేసి, హత్యచేసిన తరువాత, తనను తాను రాయితో మోదుకుని గాయపర్చుకున్నాడు. అంతే క్షణాల్లో కట్టుకథ అల్లాసి పోలీసులకు చెప్పాడు. అతనందించిన సమాచారంలో రంగంలోకి దిగిన పోలీసులు నిన్న ఉదయం బాలిక మృతదేహాన్ని కనుగోన్నారు.

ఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తండ్రి ఎదుట స్థానిక అటోడ్రైవర్లందరినీ పిలిపించి వారిలో అనుమాతనితులను చెప్పాల్సిందిగా కోరారు. తాను వారిని గుర్తు పట్టలేకపోతున్నానని చెప్పిన తండ్రిపై సందేహించిన పోలీసులు అతన్ని వచారించగా..తానే నేరం చేశానని అంగీకరించాడు. దీంతో తండ్రి మెకావత్ కమల్ పై అత్యాచారం, హత్య సహా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు మరిన్ని వివరాలను తరువాత తెలుపుతామన్నారు.
.
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  crime news  girl abducted and killed  gang rape  

Other Articles