kcr | students | osmania university | land

Students questing telangana cm kcr for his govt

kcr, students, osmania university, land

Students questing telangana cm kcr for his govt. when the telangana strugle on peaks kcr chanted students but now not at all.

ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా కేసీఆర్..?

Posted: 05/20/2015 11:37 AM IST
Students questing telangana cm kcr for his govt

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రపోషించిన ఉస్మానియా యూనిర్సిటి విద్యార్థుల గురిచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేసీఆర్ తన నిరాహార దీక్షను విరమించారని తెలిసిన మరుక్షణం హైదరాబాద్ లో ఓయు స్టూడెంట్స్ చేసిన హడావిడి అంతాఇంతా కాదు. దాంతో కిమ్మనలేక కేసీఆర్ దీక్షను సాగించాల్సి వచ్చింది. అక్కడి నుండి తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో సర్కార్ ఏర్పడే వరకు ఓయు స్టూడెంట్స్ కేసీఆర్ వెన్నంటే నడిచారు. అయితే అప్పుడు కేసీఆర్ వెంట నడిచిన విద్యార్థుల మీదకే సవాల్ విసురుతున్నారు కేసీఆర్. అప్పుడు మీరే ఉద్యమ నేతలు, అది ఇదీ అని ఏవేవో గొప్పులు చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం యూనివర్సిటి అంటే రాజదర్బార్ అనుకుంటున్నారా..? ఏది ఏమైనా నేను చెయ్యాలనుకున్నది చేసి తీరదా .. మీకు భయపడను బ్రదర్ అంటూ కొత్త వివాదానికి తెర తీశారు కేసీఆర్.

హైదరాబాద్ బస్తీల్లో ఉంటున్న పేద వారికి ప్రభుత్వం కొత్తగా సొంతింటి కలను నిజం చెయ్యాలని భావిస్తోంది. అందులో భాగంగానే కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటికి చెందిన భూముల్లో పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టిఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఓయు విద్యార్థులు దీనిపై మండిపడుతున్నారు. తమ యూనివర్సిటి భూములను వాడుకోవడానికి మాత్రం వీలు లేదు అని అంటున్నారు.

*ఒక్క ఉస్మానియా యూనిర్సిటిలోనే భూములు ఉన్నాయా..?
* అసలు హైదరాబాద్ లో ఎక్కడా భూములు లేవా..?
* అప్పుడేమో విద్యార్థులంటే పడి చచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు వారంటే పడటం లేదు..?
* అదికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ విద్యార్థులను మరిచిపోయారా..?
* ఇంటికో ఉద్యోగం అంటూ ఊదరగొట్టిన కేసీఆర్ ఇప్పుడు విద్యార్థులకు చుక్కలు చూపుతున్నారా..?

//అభినవచారి//

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  students  osmania university  land  

Other Articles