Barack obama | twitter | account | tweets

Barack obama entered into twitter

Barack obama, twitter, account, tweets

Barack obama entered into twitter. American president barack obama opened new personal account on today.

ఒబామా.. ట్విట్టర్ ఖాతా తెరిచాడహో..

Posted: 05/19/2015 10:48 AM IST
Barack obama entered into twitter

అదేంటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఇప్పటి వరకు ట్విట్టర్ అకౌంట్ లేదా..? అయ్యో పాపం ఎందుకు లేదు..? అని ప్రశ్నలు వస్తుంటాయి. కానీ పరిస్థితి వేరేలా ఉంది. బరాక్ ఒబామా అమెరికా ప్రెసిడెంట్ ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు.. అలా ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నందున తాను స్వంతంగా, పర్సనల్ గా ట్విట్టర్ అకౌంట్ ను నడపడానికి వీలులేకుండాపోయింది. దాంతో ఒబామా ఆరు సంవత్సరాల తర్వాత ట్విట్టర్ లో పర్సనల్ అకౌంట్ తెరిచారు. తాను ట్విట్టర్ లోకి రావడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇప్పటి దాకా మూడు ట్వీట్లు చేశాడు ఒబామా.

హలో ట్విట్టర్! నేను బరాక్ ఒబామా. ఆరేళ్ల తర్వాత నేను సొంత ఖాతా తెరిచా అంటూ ఒబామా తన ఫస్ట్ ట్వీట్ పోస్ట్ చేశాడు.  కొన్ని గంటల తర్వాత న్యూజెర్సీలో తన పర్యటన గురించి ఒబామా ట్విట్టర్లో పేర్కొన్నారు. అమెరికా మాజీ బిల్ క్లింటన్ ట్వీట్కు స్పందిస్తూ మూడోసారి ఒబామా ట్వీట్ చేశారు. ఒబామా ట్విట్టర్లో 65 మంది ఫాలో అవుతుండగా, వీరిలో ఒక్కరూ విదేశీ నేత లేరు. అయితే తన ప్రొఫైల్ లో ఓ తండ్రి, ఓ భర్త, అమెరికా 44వ అధ్యక్షుడు అని తన గురించి రాసుకున్నారు ఒబామా.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Barack obama  twitter  account  tweets  

Other Articles