Chandrababu | KCR | Telangana | Ap

Chandrababu nadiu offers to telangana cm kcr

Chandrababu, KCR, Telangana, Ap, Power, Water, Offer

Chandrababu nadiu offers to telangana cm kcr. If telangana govt agree to give water to ap, then ap will give power to telangana.

కేసీఆర్ కు చంద్రబాబు సూపర్ ఆఫర్

Posted: 05/15/2015 07:59 AM IST
Chandrababu nadiu offers to telangana cm kcr

ఏపి సిఎం నారాచంద్రబాబు నాయుడుకు, తెలంగాణ సిఎం కేసీఆర్ కు అస్సలు పొసగదని అందరికి తెలుసు. పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందని కూడా తెలుసు. అయితే ఏపి సిఎం చంద్రబాబు కేసీఆర్ కు ఓ ఆఫర్ ఇచ్చారు. మీకు అది మీకు ఇది ఇస్తామంటూ ఓ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అయినా ఎప్పుడూ ఓపెన్ ఛాలెంజ్ లు చేసుకునే వీరు ఆఫర్ లు కూడా చేసుకుంటున్నారా.. కొంపదీసి ఏదైనా పండగ ఉందని అనుకుంటున్నారేమో కానీ అలాంటిదేమీ లేదు. మీరు మాకు నీళ్లివ్వండి మేం మీకు కరెంట్ ఇస్తామంటూ కేసీఆర్ కు చంద్రబాబు ఆఫర్ చేశారు. శ్రీశైలం జలాశయ నీటిని విద్యుదుత్పత్తి సాకుతో తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వాడుకుంటోందని సిఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పరస్పర అవగాహనకు వస్తే ఆ నీటితో ఉత్పత్తి అయ్యే విద్యుత్ తెలంగాణకూ ఇస్తామని, అందుకు సమానమైన నీటిని ఆంధ్రకివ్వాలని తెలంగాణ సిఎం చంద్రశేఖర్‌రావుకు ప్రతిపాదించారు. శ్రీశైలం నీటిని తీసుకెళ్లి నాగార్జునసాగర్‌లో నిల్వ చేసి వాడుకుంటున్నారని, ఫలితంగా సీమకేకాకుండా కృష్ణా డెల్టాకూ సాగు, తాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కేంద్ర జలవనరుల శాఖ పరిధిలోకి వెళ్లినందున రెండు రాష్ట్రాలు పరస్పరం చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్రం వద్దకు పంచాయితీ పెట్టకుండా రెండు రాష్ట్రాలు సమన్వయంతో వ్యవహరిస్తే ఎవరికీ నష్టం ఉండదని అభిప్రాయపడ్డారు. శ్రీశైలం నీటిని తెలంగాణ విద్యుత్ కోసమే వినియోగించుకోవాలని అనుకుంటే, ఆ విద్యుత్ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే ఆ నీటిని ఏపీకి ఇవ్వాలని సూచించారు. ప్రతి విషయంలో కెసిఆర్ గిల్లికజ్జాలు పెట్టుకోవాలని చూస్తున్నారని, అయితే తానుమాత్రం అభివృద్ధివైపే దృష్టి సారిస్తున్నానన్నారు. రాష్ట్రం విడిపోయినా తెలంగాణ ప్రజలకు తగిన సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. కెసిఆర్ తనతో చర్చలకు కూర్చుంటే కొన్నింటికైనా పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  KCR  Telangana  Ap  Power  Water  Offer  

Other Articles