Private travels | Entry tax | Strike

Private travels managments demanding for withdrawl the entry tax in telangana

Private travels, Entry tax, Strike, RTC, Telangana

Private travels managments demanding for withdrawl the entry tax in telangana. Private travels owners met in hyderbad and they demand to withdrawl the entry tax.

ఆహా.. ఇదే అదును అంటున్న ప్రైవేట్ ట్రావెల్స్

Posted: 05/09/2015 03:27 PM IST
Private travels managments demanding for withdrawl the entry tax in telangana

అవును అవకాశం దొరికేతే ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి.. ఎవ్వరూ వదులుకోరు. అందులోనూ డబ్బులతో ముడిపడిన విషయం అయితే అస్సలు వదులుకోం. ఆరు నూరైనా.. ఎంత కష్టమైనా మనకు అనుకూలంగా మార్చుకుంటాం. ఇప్పుడు ఇదే ఫార్ములాను పాటిస్తున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్లు. అవును ఒకప్పుడు బాబూ.. మేం ట్రావెల్స్ నడుపుకుంటామంటూ రిక్వెస్ట్ పెట్టుకుంటే సవాలక్ష రూల్స్ మాట్లాడే ప్రభుత్వానికే ఇప్పుడు వారు ఆడుకుంటున్నారు పనిలో పనిగా స్వామి కార్యం స్వకార్యం అన్నట్లు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం వ్యవహరిస్తున్నాయి. అప్పుడు పోపో అన్నట్లు ప్రభుత్వం ఇప్పడు మాత్రం రెడ్ కార్పెట్ పరిచి మరీ స్వాగతం పలుకుతోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణ ప్రభుత్వం వసూలు చేస్తున్న ఎంట్రీ టాక్స్ మీద ఇప్పుడే మంచి అవకాశం దొరికిందని ప్రైవేట్ ట్రావెల్స్ వారు ఆలోచిస్తున్నారు. ఓ వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెతో విసిగిపోతున్న అధికారులకు ఇప్పుడు ఎంట్రీ టాక్స్ ను తొలగించాలని ప్రతిపాదనలు పంపుతున్నారు ప్రైవేట్ ట్రావెల్ప్ యాజమాన్యం అంతేనా ఏకంగా తెలంగాణ వ్యాప్తంగా పని చేస్తున్న అన్ని క్యాబులు, ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వారు తమ మీద విధించిన ఎంట్రీ ట్యాక్స్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. అయినా ఇలాంటి టైంలోనే కదా ప్రభుత్వం కూడా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాల మాటలకు విలువనిచ్చేది. అందుకే అదనుచూసి ప్రతిపాదిస్తున్నారు

*అభినవయచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Private travels  Entry tax  Strike  RTC  Telangana  

Other Articles