Eamcet | Ap | Engineering | Medical

Andhrapradesh eamcet exam on today

Today, Eamcet, Ap, Engineering, Medical, Exam

Andhrapradesh eamcet exam on today. govt arrange 25 centers for eamcet. 1,70,685 students for engineering and 84,724 students for medical stream.

మరికొద్దిసేపట్లో ఏపీ ఎంసెట్.. నిమిషం లేటైనా పర్లేదు

Posted: 05/08/2015 07:54 AM IST
Andhrapradesh eamcet exam on today

మరికొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్ పరీక్ష ప్రారంభం కానుంది. ఎంసెట్ పరీక్ష కోసం కోడ్ ఎన్ -1  ఇంజినీరింగ్ ప్రశ్నాపత్రాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎంపిక చేశారు. ఈ పరీక్షకు మొత్తం 2,55,409 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఇందులో ఇంజినీరింగ్‌ విభాగానికి చెందినవారు 1,70,685 మంది కాగా, అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ విభాగానికి చెందినవారు 84,724 మంది ఉన్నారు. రెండు విభాగాలకూ దరఖాస్తు చేసుకున్నవారు 1260 మంది. ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్ష జరగనుంది. అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ అభ్యర్థులకు సాయంత్రం 2.30-5.30 గంటల మధ్య జరుగుతుంది. ఈ పరీక్షల నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌లో 22 రీజినల్‌ సెంటర్లు, హైదరాబాద్‌లో 3 రీజినల్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు.

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సాధ్యమైనంత వరకు ఎవరికివారు సంబంధిత పరీక్ష కేంద్రాలకు గంట ముందు చేరుకోవాలని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఎక్కడైనావిద్యార్థులు ఆలస్యంగా వస్తే వారిని అనుమతించే విషయంలో అధికారులు నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు. ఇక.. పరీక్ష పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన చర్యలన్నీ తీసుకున్నామని ఏపీ ఎంసెట్‌ చైర్మన్‌, జేఎన్టీయూకే వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ వీఎ్‌సఎస్‌ కుమార్‌ తెలిపారు. రెండు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాల గురించి ఎంసెట్‌ కన్వీనర్‌ సీహెచ్‌ సాయిబాబు చెప్పారు. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు ఇంజనీరింగ్‌ పరీక్ష సెట్‌ కోడ్‌ ను మంత్రి గంటా, అగ్రికల్చర్‌-మెడిసిన్‌ పరీక్ష సెట్‌ కోడ్‌ను 10 గంటలకు వైద్య మంత్రి కామినేని శ్రీనివాస్‌ విడుదల చేస్తారని చెప్పారు. ఏపీ ఎంసెట్‌-2015పై సందేహాల నివృత్తికి విద్యార్థులు, తల్లిదండ్రులు 1804256755 టోల్‌ ఫ్రీ నెంబర్‌లో సంప్రదించవచ్చు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Today  Eamcet  Ap  Engineering  Medical  Exam  

Other Articles