TRS | Family| Photo

Trs partys main leaders kavitha ktr and harish raos new photo in net

TRS, Family, Photo, Kavitha, Harish rao, KTR, Net

TRS partys main leaders kavitha, ktr and harish raos new photo in net. A new photo of three main leaders of trs with sharing one table in nagarjunasagar going viral in the net.

డం..డండడకర డం.. ఓ ఫోటో ముగ్గురు నేతలు

Posted: 05/05/2015 01:01 PM IST
Trs partys main leaders kavitha ktr and harish raos new photo in net

అనుబంధాలకు, ఆప్యాయతలకు నెలవు కుటుంబం అయితే అదే రాజకీయ నాయకుల కుటుంబాలు అయితే ప్రేమ కాస్త ఎక్కువే ఉంటుంది. గత కొంత కాలంగా ఆ కుటుంబంలొ విభేదాలు వస్తున్నాయని పుకార్లు వచ్చినా.. అవి పుకార్లు మాత్రమే నిజాలు కావు అని తేలింది. అవును మేం చెడుతున్నది కేసీఆర్ గారి కుటుంబం గురించి. తెలంగాణ రాష్ట్ర సమితికి మూలస్తంభం కేసీఆర్.  ఆయన తర్వాత పార్టీకి వెన్నుదన్నుగా ఉండే మరో మూడు స్తంభాలు.. కేటీఆర్, హరీశ్ రావ్, కవిత. కేసీఆర్ తర్వాత ఎవరంటే మాత్రం.. ఒక్కొక్కరిదీ ఒక్కో సమాధానం. కొంతమంది కేసీఆర్ తనయుడు కేటీఆర్ అని, మరి కొంత మంది మాత్రం పార్టీలో మొదట్నుంచీ ఉన్న హరీశ్రావ్ అన్నది మరికొంతమంది సమాధానం. కవితకు ఏం తక్కువంటూ ప్రశ్నించేవాళ్లు ఇంకొంతమంది. మొత్తానికి టీఆర్ఎస్ లో ఈ ముగ్గురి మధ్య ఆధిపత్య పోరు ఉందన్నదని పార్టీలో అందరూ చెప్పే విషయం.

కేటీఆర్, కవిత, హరీశ్రావుల మధ్య దూరం పెరిగిందంటూ కొన్నాళ్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే.. వీటన్నింటికీ చెక్ పెట్టే కొన్ని ఫొటోలు సాగర్ శిబిరం సాక్షిగా బయటపడ్డాయి. హరీశ్ రావు, కేటీఆర్, కవిత.. ముగ్గురూ ఒకే టేబుల్ దగ్గర కూర్చుని చాలా సీరియస్ గా చర్చలు జరపడం టీఆర్ఎస్ నేతలనే అవాక్కు పరిచింది. ముగ్గురి బాడీ లాంగ్వేజ్ కూడా చాలా సీరియస్ టాపిక్ పైనే చర్చ సాగుతున్నట్లు స్పష్టం చేస్తోంది. ఒకరు సీరియస్ గా మాట్లాడుతుంటే.. మిగిలిన ఇద్దరూ అంతే సీరియస్ గా వింటుండడం ఈ ఫోటోల్లో కనిపిస్తోంది. అసలు అంత సీరియస్గా ఎందుకు మాట్లాడుకున్నారు... ఏం మాట్లాడుకున్నారన్న దానిపై టీఆర్ఎస్ నేతలూ సీరియస్గానే చర్చలు జరుపుతున్నారు. ఈ సమయంలోనే అటుగా వెళ్లిన ఓ నేత.. ఈ ముగ్గురి కలయికను తన ఫోన్లో బంధించి నెట్లోకి అప్లోడ్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఫోటోలో ఉన్నట్లు నిజంగావీళ్ల మనసులు కూడా కలిశాయో లేదో మరి..!

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  Family  Photo  Kavitha  Harish rao  KTR  Net  

Other Articles