Asaduddin Owisi, Mim, vajpyee, BharataRatna,

Asadudin owisi condemn the bharata ratna award to atalbihari vajpyee

Asaduddin Owisi, Mim, vajpyee, BharataRatna,

Mim Party president asadudin owisi condemn the Bharata ratna award to atalbihari vajpyee. He said that vajpyee statementes very terrobile when the ayodhya incident happened.

ఓవైసీ.. వాయిపేయికి భారతరత్న అవార్డు వద్దా?

Posted: 05/05/2015 08:48 AM IST
Asadudin owisi condemn the bharata ratna award to atalbihari vajpyee

వడ్డించే వాడు మనవాడు ఐతే బంతి చివర్లో కూర్చున్నా రావాల్సింది వస్తుంది అన్న చందాన మన ప్రభుత్వాలు అప్పుడప్పుడు వ్యవహరిస్తుంటాయి. అయితే ఏ ప్రభుత్వం వస్తే వారికి అనుకూలంగా ఉన్న, ఉంటున్న వారికి అవార్డులు ఇవ్వడం మామూలే. కాంగ్రెస్ నుండి బిజెపి పార్టీ వరకు అన్ని పార్టీలు ఇదే ఫార్ములాను పాటిస్తున్నాయి. అయితే కొన్ని సార్లు నిజంగా అర్హత ఉన్న వాళ్లకు అవార్డులు ప్రకటించినా ఏదో పార్టీ వారు దానిపై పేచీ పెట్టడం మామూలైపోయింది. తాజాగా భారత మాజీ ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు వాజపేయికి భారత రత్న అవార్డు బహూకరించడంపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ ఉప ప్రధాని ఆడ్వాణీని ‘పద్మ విభూషణ్‌’తో సత్కరించడాన్ని కూడా తప్పుబట్టారు. ఆదివారం రాత్రి జరిగిన ఒక పుస్తకావిష్కరణ సభలో అసదుద్దీన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘అయోధ్య అంశంపై వాజపేయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మతపరంగా రెచ్చగొట్టేలా మాట్లాడారు. 1992 డిసెంబర్‌ 5వ తేదీన వాజపేయి చేసిన ఆ ప్రసంగం వీడియో ఇప్పటికీ యూట్యూబ్‌లో ఉంది. మనం ఈ విషయాన్ని మరిచిపోయామా? నాడు ‘నేలను చదును చేస్తాం’ అని వ్యాఖ్యానించిన వారికి నేడు భారత రత్న ఇచ్చారు’’ అంటూ ఒవైసీ విమర్శించారు. ఆడ్వాణీకి ‘పద్మ విభూషణ్‌’ ఇవ్వడం గురించి ప్రస్తావిస్తూ... ‘‘ఆడ్వాణీ తన రథయాత్రతో దేశమంతా విధ్వంసాన్ని విస్తరించారు. నేర అభియోగాలు (అయోధ్య కేసులో) ఎదుర్కొంటున్న వ్యక్తికి ఈ దేశపు రెండో అత్యున్నత పురస్కారాన్ని ఎలా ఇస్తారు?’’ అని ప్రశ్నించారు.
 
అయితే అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. ఈ అంశానికి మతంరంగు పులమడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించింది. ‘‘ఈ దేశానికి ఎంతో సేవ చేసిన వారికి అవార్డులు ఇవ్వడాన్ని ఎందుకు తప్పుపడుతున్నారు? ఎందుకంటే... దేశానికి సేవ చేసిన నేతలంటే వాళ్లకు గిట్టదు. చెడు చేసే వారంటేనే వారికి ఇష్టం. బహుశా... వారి దృష్టిలో ఒసామా బిన్‌లాడెన్‌కు గొప్ప అవార్డులు ఇవ్వాలి కాబోలు’’ అని కేంద్ర మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ ఎద్దేవా చేశారు. కేవలం మతపరమైన విద్వేషాన్నే రెచ్చగొట్టి జాతీయ స్థాయిలో రాజకీయంగా ఎదగాలనుకునే వారి వైఖరి ఇలాగే ఉంటుందని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు ద్వివేదీ వ్యాఖ్యానించారు.మొత్తానికి భారతరత్న అవార్డుల నేతల నోటికి పని కల్పిస్తోంది అలానే మీడియా వారికి మంచి న్యుస్ ఐటంగా మారడం దురదృష్టం.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Asaduddin Owisi  Mim  vajpyee  BharataRatna  

Other Articles