Telangana | KCR | Elections

Telangana cm kcr said that all the public representatives must serve to the people

Telangana,, KCR, Elections, Representative, Service,

Telangana cm kcr said that all the public representatives must serve to the people. If we serve better to people we will also win in 2019 elections.

ప్రజల కోసం పని చేస్తే మళ్లీ మనమే గెలుస్తాం

Posted: 05/05/2015 07:45 AM IST
Telangana cm kcr said that all the public representatives must serve to the people

ప్రజలకోసం కష్టపడి పనిచేయండి 2019లోనూ మనమే గెలిచితీరుతాం అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ప్రజాప్రతినిధులతో అన్నారు.  ప్రజా ప్రతినిధి అంటే గొప్పగా పనిచేయాలనే తపన ఉండాలి.. సమా జంలో గౌరవం పెంచేలా పనిచేయాలి.. ప్రజలకోసమే ఆ పని జరగాలి.. అని ప్రజాప్రతినిధులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలితరం ప్రజాప్రతినిధులుగా పనిచేయడం మనందరి అదృష్టం.. మనం చారిత్రాత్మక పాత్ర నిర్వర్తించి గొప్ప పేరు సంపాదించుకోవాలని అన్నారు. రాజకీయంతో డబ్బులు సంపాదించడమే పరమావధి అనుకుంటే తప్పు. డబ్బు సంపా దనకు చాలా మార్గాలున్నాయి. గేదెపేడ అమ్ముకోనైనా డబ్బులు సంపాదించవచ్చని చెప్పారు. నాగార్జునసాగర్‌లోని విజయవిహార్‌లో గత మూడురోజులుగా తెలంగాణ రాష్ట్రసమితి ప్రజాప్రతి నిధులకు శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. చివరిరోజు జరిగిన శిక్షణా తరగతుల్లో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు, డీసీసీబి, డీసీఎంఎస్‌ చైర్మన్లు, జిల్లాపార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలకు శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగ వారినుద్దేశించి సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ ఎవ్వరంకూడా వెయ్యి సంవత్సరాలు బతకడానికి రాలేదు.. చాలా మంది కోరుకున్నా రాని అవకాశం మనకువచ్చింది. ఈ అవకాశాన్ని గొప్పగా వినియోగించుకొని పేరు తెచ్చుకోవాలన్నారు. పదవులు వస్తాయి.. కానీ ఎంతపనిచేసి నిలబెట్టుకున్నామనేదే గొప్పఅన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. రాజకీయాల్లోకి తాను అనుకోకుండా వచ్చినట్లు ఆయన తెలిపారు. తన గురువు పుణ్యమా అని చదువు బాగా అబ్బిందని, తాను మొత్తం మీద 70 - 80వేల పుస్త కాలు చదివానని ఆయన ఈ సందర్భంగా వెల్లడిం చారు. నియోజకవర్గఇన్‌చార్జీలు ప్రభుత్వ పథకా లను ప్రజల్లోకి తీసుకెళ్ళే బాధ్యతను తీసుకోవా లన్నారు.

రాష్ట్ర మంత్రులు నియోజకవర్గ ఇన్‌చార్జీ లను కడుపులోపెట్టుకొని చూసుకోవాలని కోరారు. తొలితరం ప్రతినిధులుగా చరిత్రలో నిలిచిపో వాలన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తుందనే నమ్మకం మొదట్లో చాలామందికి కలగలేదని దానిని సుసాధ్యం చేసుకున్నామని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫలితాలు అనుభవిస్తున్నాం.. కృష్ణానీళ్ళు తెచ్చుకోగలుగుతున్నాం.. కరెంటు ఇచ్చుకుంటున్నాం.. కరెంటులేక ఒక గుంటకూడా పొలం ఎండలేదని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ప్రకృతి ప్రకోపంతో నష్టం జరిగి ఉండవచ్చని కరెంటుతో ఏమాత్రం ఇబ్బందులు కలగలేదన్నారు. ప్రజల సుఖదు:ఖాల్లో ప్రజాప్రతినిధులు పాలుపంచుకోవా లన్నారు. ప్రజలను మరిచిపోతే మాత్రం చరిత్రలో అందరు పోయినమాదిరిగానే మనంకూడా కొట్టుకుపోతామన్నారు.

వచ్చే మార్చి నుంచి రైతులకు పొద్దటి పూట కరెంట్ సరఫరా చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో మూడు పంటలు పండించే కాలం వస్తుందన్నారు. తెలంగాణ వస్తే కరెంట్ రాదని ఆంధ్ర సీఎంలు అబద్ధాలు ప్రచారం చేశారని కేసీఆర్ ఆ సందర్భంగా గుర్తు చేశారు.తేలంగాణ ఆవిర్భవించిన ఏడాది లోగానే తెలంగాణలో కరెంట్ కష్టాలు పోయాయి. రానున్న కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలోవిద్యుత్ సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పుడు దేశం అంతా మన వైపే చూస్తోందన్నారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే మిన్నగా తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలన్నారు. తెలంగాణ నీటి కష్టాలకు 60 ఏళ్ల తప్పిదాలే కారణమని కేసీఆర్ చెప్పారు. నీటి కష్టాలను కడతేర్చడానికే20 వేల కోట్ల రూపాయలతో మిషన్ కాకతీయ చేపట్టామని కేసీఆర్ అన్నారు. చెరువుల పునరుద్ధరణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  KCR  Elections  Representative  Service  

Other Articles