chiranjeevi comments on ap capital

Congress demands special status for andhra pradesh

chiranjeevi comments on ap capital, special status for Andhra Pradesh, state congress, chiranjeevi, Congress, special status, Andhra Pradesh, raghuveera reddy, botsa satyanarayana, congress, andhra pradesh, state reorganisation act,

Congress workers today staged a demonstration here seeking special status for Andhra Pradesh in accordance with the state reorganisation act.

నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా కోసం ఉద్యామనికైనా సిద్దం

Posted: 05/02/2015 08:55 PM IST
Congress demands special status for andhra pradesh

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరుతో రైతులను అమరులను చేసి వారి సమాధుల మీద రాజధాని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల సామూహిక నిరసన దీక్ష ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాజధాని అంశంపై కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కనపెట్టి.. రైతుల భూములను లాక్కుని చంద్రబాబు రాజధాని నిర్మాణం చేపడుతున్నారని, ఇది సహేతుకం కాదని చిరంజీవి దుయ్యబట్టారు.

ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా జూలైలో పర్యటిస్తారని చెప్పారు. ముడుపుల కోసమే పోలవరం ప్రాజెక్టును పక్కనపెట్టి పట్టిసీమ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తెరమీదకు తీసుకువచ్చి.. వెనువెంటనే పనులను చేపడుతుందని విమర్శించారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కుని నినదించారు. రాష్ట్ర పునర్విభజన సమయంలో తాను హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కోరితే సమైక్యం పేరుతో కొందరు కాంగ్రెస్‌ నేతలే తప్పుదారి పట్టించారని గుర్తచేశారు.

టీడీపీ దొంగ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, ఆ పార్టీ నేతలను తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఆంధ్రుల హక్కులను కాలరాయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈనెల 13 తర్వాత ప్రభుత్వ పాలనపై వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని రఘువీరా తెలిపారు. రైతుల గురించి అందరూ మాట్లాడుతున్నారని కానీ వారి బాధలు పట్టించుకునే నాథుడే లేడని కాంగ్రెస్‌ నేత, మాజీమంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బీజేపీ గంటకో మాట.. ఊరికో ప్రకటన చేస్తోందన్నారు. పది నెలల్లో ప్రభుత్వ చేసింది శూన్యమని ఆయన అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : state congress  chiranjeevi  Congress  special status  Andhra Pradesh  

Other Articles