Uttarpradesh | Nepal | Earth quake

Uttarpradesh govt helping to the nepal earth quake victims

Uttarpradesh, Nepal, Earth quake,

Uttarpradesh govt helping to the nepal earth quake victims. Uttarpradesh govt helping nearly seven thousand nepal victims.

నేపాల్ తనవంతుగా ఆదుకుంటున్న ఉత్తర్ ప్రదేశ్ సర్కార్

Posted: 04/30/2015 05:05 PM IST
Uttarpradesh govt helping to the nepal earth quake victims

నేపాల్ భూకంప బాధితులకు సేవలు అందించడంలో యూపీ సర్కార్ కూడా నేను సైతం.. అంటూ సాయపడుతోంది. నేపాల్ భూకంపం వంటి దుర్ఘటన సమయంలో ఎవరు ఎంత సాయం అందించినా తక్కువే. కానీ, భూకంపం సంభవించిన వెంటనే స్పందించిన యూపీ సర్కార్ దాదాపు 6, 670మంది భారతీయులను, 30 మంది విదేశీయులను భూకంపపీడిత ప్రాంతాలనుంచి ఖాళీ చేయించి, సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి భోజన, వసతులు కల్పించింది. ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత రైల్వే ప్రయాణం పాసులను బాధితులకు అందించింది. దీంతో వారు తాము వెళ్లదలచుకున్న ప్రాంతాలకు ఉచితంగా వెళ్లగలిగారు. యూపీ బీహార్, మహారాష్ట్ర , గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటకకు చెందిన ప్రజలు సాయం అందుకున్నవారిలో ఉన్నారు. 2.500 మంది తమ సొంత వాహనాల్లో సరిహద్దులు దాటి, మనదేశంలో ప్రవేశించేందుకు అనుమతినిచ్చారు. యూపీ సర్కార్ 250 బస్సులను నేపాల్ లో భూకంపం దెబ్బతిన్న ప్రాంతాలకు పంపి, ఉచితంగా వారందరినీ తీసుకువచ్చి సహాయ శిబిరాల్లో ఉంచి , భోజన సదుపాయం కల్పించింది.

రైల్వే మంత్రిత్వశాఖ నేపాల్ నుంచి యూపీ, ఇతర ప్రాంతాలకు వెళ్లే .. ప్రజలకు ఉచితంగా రైలు సర్వీసులు కల్పించింది. మహరాజ్ గంజ్, గోరఖ్ పూర్ లో సహాయ శిబిరాల్లోని వారికి స్పెషల్ రైల్ కూపన్లు అందించారు. ఆ కూపన్ ఉంటే.. రైలులో ఉచితంగా స్వస్థలానికి వెళ్లవచ్చు. బీహార్ కు చెందిన వారే 1700 మంది ఈ సౌకర్యం వినియోగించుకున్నారని యూపీ రిలీఫ్ కమిషనర్ తెలిపారు. ఇదే సమయంలో ఎన్నో స్వచ్ఛందసంస్థలు.. బాధితులకు దుస్తులు, దుప్పట్లు, మంచినీరు, ఆహారం, క్లోరిన్ టాబ్లెట్లు, బేబీ ఫుడ్, శానిటర కిట్స్, ఇతర సౌకర్యాలు కల్పించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోరఖ్ పూర్ లో నగదు ఎక్ఛేంజి కేంద్రాన్ని ఏర్పాటు చేసి నేపాల్ కరెన్సీ ఉన్నవారికి క్యాష్ ఎక్ఛేంజి చేసింది. భూకంపం వల్ల యూపీలో మొత్తం 16 మంది చనిపోయారు. వంద మందికి పైగా గాయపడ్డారు. వారందరికీ ఉచిత వైద్య సేవలు అందించారు. యూపీలో భూకంపం వల్ల 17 సర్కారు భవనాలతో పాటు 241 ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. వందలాది ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttarpradesh  Nepal  Earth quake  

Other Articles