Etakaram Movie Actor Vijay Died in Nepal Earthquake | Kathmandu Crime News

Etakaram movie actor vijay died nepal earthquake updates

Etakaram movie unite, Etakaram movie actor vijay, actor vijay news, Etakaram actor vijay died, Etakaram actor vijay updates, nepal earthquake news, kathmandu earthquake updtes, kathmandu news, kathmandu tremors, Etakaram updates, Etakaram movie news

Etakaram Movie Actor Vijay Died Nepal Earthquake Updates : Etakaram Movie Actor Vijay Died in Nepal Earthquake Incident while they coming back to india.

నేపాల్ ఘటనలో ‘ఎటకారం’ నటుడు విజయ్ మృతి

Posted: 04/27/2015 10:51 AM IST
Etakaram movie actor vijay died nepal earthquake updates

గత 50 సంవత్సరాల నుంచి చాలా నిశ్శబ్ధంగా వున్న నేపాల్.. శనివారం సంభవించిన ‘భూకంపం’ ధాటిని ఒక్కసారిగా కకావికలమైంది. అయితే.. ఈ దుర్ఘటన జరగడానికి ముందు అక్కడికి ‘ఎటకారం’ మూవీ యూనిట్ పయనమైన విషయం తెలిసిందే! అక్కడి నిశ్శబ్ద వాతావరణంలో తమ సినిమాను చిత్రీకరించుకోవడం వెళ్లిన ఆ యూనిట్ ని దురదృష్టం నీడలా వెంటాడింది. ‘శుభం’ కార్డుతో సంతోషంగా తిరిగి వస్తారని భావించిన వారికి చివరికీ అక్కడి ఘటనకు భాధితులుగా మారాల్సి వచ్చింది.

షూటింగ్ నిమిత్తం నేపాల్ వెళ్లిన ‘ఎటకారం’ మూవీ యూనిట్.. శనివారం అక్కడ సంభవించిన భూకంపంలో చిక్కుకుపోయింది. వారి ఆచూకీ గల్లంతు కావడంతోపాటు ఫోన్లు పనిచేయకపోవడంతో ఇక్కడ వారి కుటుంబ సభ్యులు తీవ్రఆందోళనలో మునిగిపోయారు. అయితే అదేరోజు రాత్రి వారు క్షేమంగా ఉన్నట్టు ఇక్కడికి సమాచారం అందించిన నేపథ్యంలో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. అంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నా.. దురదృష్టం వీరిని వదల్లేదు. భూకంపం నుంచి తప్పించుకున్న తాము తిరిగి ఇండియా చేరుకుందామనుకున్నలోపే దారుణం చోటు చేసుకుంది.

భూకంపం నుంచి తృటిలో బయటపడి తప్పించుకున్న యూనిట్‌ బృందం ఖాట్మాండు నుంచి కారులో తిరిగి వస్తుండగా.. ఈరోజు ఉదయం మరోమారు భూకంపం సంభవించింది. దీంతో నూతన నటుడు విజయ్‌ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి దొర్లిపోయింది. ఈ ప్రమాదంలో విజయ్‌ మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. విజయ్‌ మృతితో ఆయన స్వస్థలం గుంటూరు జిల్లాలోని బాపట్లలో విషాదఛాయలు అలుముకున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Etakaram Movie  Actor Vijay  Nepal Earthquake  

Other Articles