Telangana | Chicken | Eggs | Birdflu | Chicken lovers

Telangana ministers padmarao eetela rajender ate chicken in hyderabad

Telangana, chicken, eggs, birdflu, chicken lovers

Telangana ministers padmarao, eetela rajender ate chicken in hyderabad. They said that bird flu is not in telangana, so anybody can eat chicken and eggs.

మీ ప్రేమ తగలెయ్యా.. దానికి ఇలా చెప్పాలా..?

Posted: 04/24/2015 10:45 AM IST
Telangana ministers padmarao eetela rajender ate chicken in hyderabad

కొందరికి చికెన్ అంటే ఎంతో ఇష్టం. ఇష్టం అనే దానికన్నా ప్రాణం అనొచ్చు. చికెన్ లో ఏ వెరైటీలు పెట్టినా లొట్టలేసుకుంటూ ప్లేట్ మొత్తం ఊడ్చే వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే కొంత కాలంగా చికెన్ ప్రేమికులకు కాస్త గడ్డుకాలం నడుస్తోంది. కోళ్లకు బర్డ్ ఫ్లూ వచ్చిందన్న వార్త విని.. చికెన్ ప్రేమికులు తెగ బాధపడిపోతున్నారు. అయితే నిరభ్యంతరంగా చికెన్ తినవచ్చు అని ఫౌల్ట్రీలు ప్రచారం చేస్తున్నా.. పరిస్థితి మారడం లేదు. అందుకే తెలంగాణలో బర్డ్ ఫ్లూ గట్రా ఏమీ లేదు ఇదిగో మేమే తింటున్నాం మీరూ తినండి అంటున్నారు తెలంగాణ మంత్రులు.

చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, జింజర్ చికెన్, ఎగ్ మసాలా ఇలా కోడిగుడ్డు, చికెన్ లతో ఎన్ని వెరైటీలు వీలైతే అన్ని వెరైటీలు లాగించేయండి.. ఏం భయం లేదు. బర్డ్ ఫ్లూ అసలు రాదు అని అభయం ఇస్తున్నారు తెలంగాణ మంత్రులు.మన రాష్ట్రమనే కాదు, దేశంలోనే బర్డ్‌ఫ్లూ అనేది లేదని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.  హైదరాబాద్ చిలకలగూడలోని సాబిహా పౌల్ట్రీ ట్రేడింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'చికెన్, గుడ్డు' మేళాలో మంత్రి పాల్గొన్నారు. ఆయనతో పాటు ఎక్సైజ్ మంత్రి టి.పద్మారావు పాల్గొని చికెన్‌ను ఆరగించారు. ఆరగించడం అంటే ఏదో మామూలుగా కాదు ఒకరికి ఒకరు తినిపించి తెగ ప్రేమ చూపించేశారు. చికెన్, గుడ్డు అంటే ఎంత ప్రేమ ఉంటే మాత్రం కాస్త ఎక్కువగా తింటారే కానీ..  ఏకంగా ఒకరికి ఒకరు తినిపించుకునేంత ప్రేమ ఉందా అని అనుకున్నారట అక్కడి జనం. అంతేకాదు  నేటి నుండి ప్రారంభం కానున్న తెరాస ప్లీనరీలోనూ చికెన్ పెడుతున్నామని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. మరి చికెన్ ప్రేమ వెరీ గుడ్డు కదండీ..

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Telangana  chicken  eggs  birdflu  chicken lovers  

Other Articles