Agra | Child | Population | Uttarpradesh

A child wrote that his father increacing population

child, population, increase, people, exam, uttarpradesh, agra

A child wrote that his father increacing population. THe world facing population problem, a child worte that his father inceracing population.

జనాభా పెరుగుదలకు కారణం.. మా నాన్నే

Posted: 04/21/2015 04:19 PM IST
A child wrote that his father increacing population

జనం.. ఎటు చూసినా జనమే జనం. ప్రపంచంలో రోజురోజుకు జనాభా భయంకరంగా పెరిగిపోతోంది. దీంతో భూమిపై నివాస స్థలం కరవవువుతోంది. గాలి, నీరు, ఆహారం.. ఇలా ప్రతిదానికి కొరతే. మరి ఇంతలా జనాభా పెరిగిపోవడానికి కారణం ఎవరు అని ప్రశ్నిస్తే.. మా నాన్న అంటున్నాడు ఓ అబ్బాయి. అవును మీరు చదువుతున్నది అక్షరాల నిజం... ఓ అబ్బాయి తన తండ్రి వల్లే జనాభా పెరుగుతోందని అంటున్నాడు. ఏదో తెలియక అన్నాడని అనుకుంటున్నారేమో.. అస్సలు కాదు అబ్బాయికి అన్నీ తెలిసే ఆ మాట అన్నాడు మరి. ఇంతకీ ఎవరా అబ్బాయి.. జనాభాకు వాళ్ల నాన్నకు ఉన్న సంబందం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే..

ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జరుగుతున్న పదో తరగతి పరీక్షలో వింత జవాబు కనిపించింది. జనాభా పెరుగుదలకు కారణం ఏమిటి అని సైన్స్ ఎగ్జామ్ లో అడిగిన ప్రశ్నకు ఆ విద్యార్థి ఇలా సమాధానం ఇచ్చాడు. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా.. తన తండ్రి వరుస పెట్టి పిల్లలను కంటూ పోవడమే జనాబా పెరుగుదలకి కారణం అని ఆ అబ్బాయి పెద్ద వ్యాసమే రాసాడు. కనడమైతే కన్నాడు కానీ.. ఆ తర్వాత తమ ఆలనపాలన పట్టించుకోలేదని.. దీంతో చివరకు అంతా దిక్కులేని వారిలా అయ్యామని ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం ఒక పూట తిండి కూడా తినలేని దుర్బర పరిస్థితిలో తమ కుటుంబం ఉందని వాపోయాడు. ఎంతో ఆలోచనతో ఆ విద్యార్థి రాసిన వింత జవాబును చూసి పేపర్లు దిద్దే టీచర్లు తెగ నవ్వుకున్నారు. కొందరు మాత్రం అయ్యో పాపం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రకంగా ఆ ప్రశ్నకు ఆ పిల్లాడు రాసింది కరెక్ట్ ఆన్సరే అయినా.. రూల్స్ ప్రకారం వెళ్లాలి కదా.. అందుకే ఆ అబ్బాయి సైన్స్ ఎగ్జామ్ లో ఫెయిల్ చేశారు టీచర్లు. పాపం నిజాలు చెప్పినందుకు బుడ్డోడిని ఏకంగా ఫెయిల్ చేశారు. మరి పాపం అబ్బాయి తండ్రి పరీక్షలో ఫెయిల్ అయినందుకు  వాయిస్తాడో.. తన గురించి అందరికి తెలిసేలా చేసినందుకు వాయిస్తాడో.. లేదా చిన్న పిల్లాడి చేత చెప్పించుకున్నందుకు సిగ్గుపడతాడో మరి తెలియదు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : child  population  increase  people  exam  uttarpradesh  agra  

Other Articles