Council | Telangana | Highcourt | Swamygoud

Ap high court noticed to telangana council chairman

highcourt, order, swamy goud, TTDPLP, TRSLP, council, Telangana

Council | Telangana | Highcourt | Swamygoud Ap high court noticed to telangana council chairman. The high court order to give explenation on the TDPLp leaders recognisation as TRSLP leaders in the council.

తెలంగాణ మండలి చైర్మెన్ కు హైకోర్ట్ నోటీసులు

Posted: 04/20/2015 03:29 PM IST
Ap high court noticed to telangana council chairman

తెలంగాణలో టిడిపి నుండి గెలిచిన నేతలు టిఆర్ఎస్ లో చేరారు. అయితే వారిని టిఆర్ఎస్ ఎల్పీలో గుర్తింపునిచ్చారు. గతంలో టిడిపి నుండి చేరిన వారిని ఎలా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా గుర్తిస్తారని టిడిపి నాయకులు గతంలోనే ప్రశ్నించారు. అయితే ఇలా వివాదాలకు తెర తీసిన పాత తెలుగుదేశం, ప్రస్తుత టిఆర్ఎస్ నేతల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. తెలంగాణ శాసనమండలి చైర్మెన్ నిర్ణయంపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చెయ్యడం వార్తల్లో నిలిచింది.  టీఆర్‌ఎస్‌ఎల్పీలో టీడీఎల్పీ విలీనంపై న్యాయస్థానం ఈ మేరకు హైకోర్ట్ నోటీసులు ఇచ్చింది. ఏ ప్రాతిపదికన టీడీపీ ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ఎల్పీలో విలీనమైనట్లు ప్రకటించారో రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

మార్చి 9న టీడీపీ ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, పట్నం నరేందర్‌రెడ్డి, గంగాధర్‌రెడ్డి, ఎండీ సలీంను గుర్తిస్తూ సీట్లు కేటాయించాలని మండలి చైర్మన్‌ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ఎల్పీలో టీడీఎల్పీ విలీనమైనట్లుగా అసెంబ్లీ కార్యదర్శి రాజాసదారాం అప్పట్లో ఓ బులెటిన్ కూడా విడుదల చేశారు. దీన్ని సవాల్ చేస్తూ టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. మొత్తానికి ఎన్నో మలుపులు తిరిగిన టిఆర్ఎస్, టిడిపి నేతల వ్యవహారం ఇప్పుడు హైకోర్టు జోక్యంతో మరింత ముదిరింది. మరి హైకోర్ట్ దీనిపై ఏ తీర్పునిస్తుందో వేచి చూడాలి.

**అభినవచారి**

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : highcourt  order  swamy goud  TTDPLP  TRSLP  council  Telangana  

Other Articles