HImachalpradesh | Highcourt | Order | Janshatabdi Express

Himachal pradesh high court order to attach delhi una janshatabdi express in a case

himachalpradesh, high court, order, Janshatabdi Express, Delhi-Una , Mukesh Bansal, Mela Ram ,Madan Lal

Two farmers from Himachal Pradesh's Una district may become proud owners of Delhi-Una Janshatabdi Express on April 16 if a court order is executed. The court of Una's additional district and sessions judge Mukesh Bansal on April 9 ordered to attach the Delhi-Una Janshatabdi if the railways failed to pay compensation to two farmers whose land was acquired for laying the Una-Amb track in 1998.

రైతులకు రైలు ఇచ్చేయండి.. హిమాచల్ ప్రదేశ్ హైకోర్ట్ సంచలన తీర్పు

Posted: 04/14/2015 10:56 AM IST
Himachal pradesh high court order to attach delhi una janshatabdi express in a case

నష్ట పరిహారం ఇవ్వాలంటూ కోర్టుకు వెళ్లిన రైతులకు హిమాచల్ ప్రదేశ్ హైకోర్ట్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. నష్ట పరిహారం ఇవ్వకపొతే ఏకంగా రైలునే రైతులకు ఇవ్వాలంటూ తీర్పునిచ్చింది. కోర్ట్ ఇచ్చిన తీర్పు ఇప్పుడు వార్తల్లో నిలిచింది. రైల్వే ప్రాజెక్టు కోసం తమ భూములను ఇచ్చిన ఇద్దరు రైతులకు నష్ట పరిహారాన్ని చెల్లించడంలో రైల్వే మంత్రిత్వ శాఖ జాప్యం చేస్తూ వచ్చింది. దాంతో విసిగిపోయిన ఆ రైతులు కొర్టును ఆశ్రయించారు. అలా కోర్టు ముందుకు వచ్చిన రైతులు తమ ఆవేదనన వ్యక్తం చేశారు. అయితే ఏప్రిల్ 15వ తేది వరకు ఇద్దరు రైతులకు నష్ట పరిహారాన్ని చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఢిల్లీ-ఉనా జనశతాబ్ది రైలును అటాచ్ చెయ్యాలని తీర్పునిచ్చింది. ఒకవేళ ఏప్రిల్ 15 లోపు రైల్వే శాఖ నష్ట పరిహారాన్ని చెల్లించకపోతే.. ఏప్రిల్ 16 ఉదయం 5గంటలకు రైలును ఆపి రైతులు దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు.

రైల్వే ప్రాజెక్టు కోసం 1998లో మేలా రామ్, మదన్ లాల్ అనే ఇద్దరు రైతుల నుండి పంట పొలాలను తీసుకుంది. అయితే పొలాలను కోల్పొయిన ఆ రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి. కానీ రైల్వే శాఖ మాత్రం నష్ట పరిహారాన్ని చెల్లించడంలో తీవ్రం జాప్యం చేసింది. దాంతో మేలా రామ్, మదన్ లాల్ లు 2009లో కోర్టును ఆశ్రయించారు. అయితే 2011లో బాధిత రైతులకు నష్ట పరిహారాన్ని పెంచాలని జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. కానీ అప్పుడు కూడా నష్ట పరిహారం అందక పోవడంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అలా మొత్తానికి హైకోర్టు వారికి తలా 35 లక్షల రూపాయలను ఏప్రిల్ 15 వ తేది లోపు చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ నష్ట పరిహారాన్ని చెల్లించకపోతే మాత్రం జనశతాబ్ది రైలును స్వంతం చేసుకోవాలని కోర్టు తీర్పును వెల్లడించింది. మరి ఒకవేళ రైల్వే నష్ట పరిహారాన్ని చెల్లించకపోతే మాత్రం రైతులకు ఆ రైలు సొంతం అవుతుంది. మరి రైలు రైతుల సొంతం అవుతుందో లేదో ఏప్రిల్ 15వ తేది తేలుతుంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : himachalpradesh  high court  order  Janshatabdi Express  Delhi-Una  Mukesh Bansal  Mela Ram  Madan Lal  

Other Articles