India has right to demand permanent UNSC seat, says Modi

India has right to demand permanent seat in un security council narendra modi

india has right to demand permanent-seat in un security council narendra modiFrance, India, Modi, UN, UN Security Council, UNESCO, India has right to demand permanent UNSC seat, says Modi, india, narendra modi, un security council, france, prime minister narendra modi, Ist world war, 75,000 soldiers sacrificed the lives in World War I.,

Prime Minister Narendra Modi made a strong pitch for India to be given a permanent seat at the UN Security Council, saying that it is not asking for it as a favour but as a "right" - having sacrificed the lives of 75,000 soldiers in World War I.

ఐక్యరాజ్యసమిలో శాశ్వత సభ్యత్వం మన హక్కు

Posted: 04/12/2015 05:46 PM IST
India has right to demand permanent seat in un security council narendra modi

భారత్కు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందేనని ప్రధాని నరేంద్రమోదీ మరోసారి పునరుద్ఘాటించారు. శాశ్వత సభ్యత్వాన్ని కలిగి ఉండటం భారత్ హక్కు అని నొక్కి చెప్పారు. ఒకప్పుడు అడిగి తీసుకునేందుకు ప్రయత్నించేవాళ్లమని ఇప్పుడు ఆ రోజులు పోయాయని, ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం భరత హక్కు అని చెప్పారు. ప్రపంచం మొత్తానికి శాంతి చిహ్నంగా భారత్ సేవలు అందిస్తున్నందున భద్రతా మండలిలో సభ్యత్వం ఇవ్వడం ద్వారా శాంతి పురుషులైన బుద్ధుడు, మహాత్మాగాంధీవంటి వారికి గొప్ప గౌరవం ఇచ్చినట్లవుతుందని సూచించారు.

తొలి ప్రపంచ యుద్దంలో 75 వేల మంది భారత సైనికులు తమ ప్రాణాలను పన్నంగా పెట్టారని, వారి త్యాగాల మేరకు ఐక్యరాజ్యసమితిలో భారత్ శాశ్వత సభ్యత్వం లభించాల్సిందేనని మోడీ అన్నారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి కారౌజెల్ డూ లావ్రీ వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భారతీయులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఇటీవల నేను పర్యాటకుడిగా ఫ్రాన్స్కు వచ్చాను. కానీ.. నేడు మాత్రం భారత్కు పర్యాటకులను తీసుకెళ్లేందుకు వచ్చాను' అని అన్నారు. ఫ్రాన్స్తో తమకు మంచి సంబంధాలున్నాయని, భారత్లో ఎలాంటి అన్యాయాలు జరిగినా మొదట గొంతెత్తి మాట్లాడే దేశం ఫ్రాన్సేనని చెప్పారు.  

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  narendra modi  un security council  france  

Other Articles