Promise! I did not abuse Shruti Haasan, pleads Kamineni Srinivas

I didn t make shruthi cry kamineni

Minister Kamineni Srinivas rao, Promise, Did Not Abuse, Actress, Shruti Haasan, Pleads, Kamineni Srinivas, Flight, Minister, Clarification, ap medical and health minister, south indian heroine Shruti Haasan, bollywood heroine Shruti Haasan,

In a major embrassement to Kamineni Srinivas, he slammed media for story about a Minister making Shruthi cry, has refuted reports that he had abused actress Shruti Haasan.

ఓట్టేసి చెబుతున్నా.. శృతి హసన్ ను ఏడిపించలేదు.. అది నేను కాదు

Posted: 04/11/2015 07:57 PM IST
I didn t make shruthi cry kamineni

ప్రముఖ సినీనటి శ్రుతి హాసన్ను ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ఏడిపించినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేయడంతో ఎట్టకేలకు ఆయన దీనిపై స్పందించారు. తన పరువును బజారు పాలు చేసేందుకు ఎవరో కుట్రపన్ని ఇలాంటి చౌవకబారు వార్తలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ వార్తలు పూర్తిగా సత్యదూరమని ఆయన ఖండించారు. ప్రమాణ పూర్వకంగా తనపై ఈ వార్తలు ఎలా వచ్చాయో తనకు తెలియదన్నారు. తాను శ్రుతి హాసన్ను సినిమాల్లో తప్ప నిజ జీవితంలో ఎప్పుడు ప్రత్యక్షంగా చూడలేదన్నారు. అలాంటిది తాను శ్రుతి హాసన్ను ఎలా ఏడిపిస్తానని కామినేని ప్రశ్నించారు. తిరుపతికి తాను ఎప్పుడు వెళ్లిన కారులో వెళ్లి వస్తానని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై మీడియా కూడా హల్ చల్ చేసి తనపై కథనాలను ప్రసారం చేయడం సమాజసం కాదన్నారు. కనీసం తన వివరణ కూడా తీసుకోకుండా ప్రసారం చేస్తున్నారని మంత్రి కామినేని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలావుండగా, శ్రుతి హాసన్, మంత్రి కామినేని శ్రీనివాస్ ఒకే విమానంలో పక్కపక్క సీట్లలో కూర్చుని ప్రయాణం చేస్తుండగా, అనుకోకుండా ఫోన్ వచ్చింది. దీంతో ఫోన్ లో మంత్రి గట్టిగా మాట్లాడుతుండడంతో డిస్టర్బ్ అయిన బాలీవుడ్ నటి శ్రుతి హాసన్.. కాస్త నెమ్మది అంటూ సలహా ఇచ్చిందట.  దాంతో కామినేనిలో ఆగ్రహం కట్టలు తెంచుకోగా, మేము ప్రజా ప్రతినిధులం పైగా మంత్రి వర్యులం... గట్టిగానే మాట్లాడతాం అని మంత్రి కోపంతో బదులు ఇచ్చారట. దీంతో  శ్రుతి హాసన్ కన్నీటి పర్యంతమైయ్యారట.  ఇది ప్రస్తుతం సామాజిక అనుసంధాన వేదికలో హల్చల్ చేస్తున్న కథనం.  అంతే కాకుండా పలు ఛానల్స్ కూడా ఈ వార్తను ప్రసారం చేశాయి. దాంతో ఆ కథనాలపై శనివారం మంత్రి కామినేని శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. అవన్నీ కట్టుకథలేనని ఆయన కొట్టిపారేశారు. అయితే శృతి హాసన్ ను ఏడిపించిన మంత్రి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావని తెలసింది. ఆయన మాత్రం తనను తాను సమర్థించుకున్నారు. శృతిని తాను ఏమీ అనలేదని చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamineni Srinivas  ap medical and health minister  shruti hasan  heroine  

Other Articles