Cong targets Gadkari for comments on rape of nun in Bengal, says rape and religion shouldn't be linked

Gadkari criticised for linking rape with religion

Congress targets Gadkari, gadkari criticised for linking rape with religion, Bangladesh, Bangladesh muslim youth, two Bangladeshis arrested for raping nun, nithin gadkari, gadkari, Congress, Goa Congress, Nitin Gadkari, Opposition, rape cases, Rape of nun in West Bengal, Rapes in India, crime against women, violenece against women

The Goa Congress has criticised central minister Nitin Gadkari's controversial comment wherein he raked up the religion of two Bangladeshis who were arrested for raping a nun in West Bengal last month.

అత్యాచారాలకు.. మతాలకు లింకుందా..? కేంద్రమంత్రికే ఎరుక

Posted: 04/10/2015 11:46 AM IST
Gadkari criticised for linking rape with religion

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపి జాతీయ అధ్యక్షుడు హెచ్చరికలను కూడా లక్ష్యపెట్టకుండా కేంద్ర మంత్రులు, బీజేపి నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు కోనసాగుతూనే వున్నాయి. పార్టీ అధికారంలోకి రావడాన్ని కోత్తగా అస్వాదిస్తున్న వ్యక్తులు ఇలాంటి ప్రకటనలు చేస్తే.. ఏదో పార్టీలో తమ పేరు కోసం పాకులాడుతున్నారని సర్ధుకోవచ్చు కానీ, సీనియర్ నేతలే ఇలాంటి వ్యాక్యలు చేసి.. విమర్శల పాలవుతున్నారు.పశ్చిమ బెంగాల్లో జరిగిన నన్పై లైంగికదాడి విషయంలో బీజేపీ నేత, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా మారాయి. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పదవులను అలకంరించిన ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది.

గోవా రాజధాని పనాజీలో ఆయన చేసిన వ్యాఖ్యాలు వివాదానికి తెరలేపాయి గోవాలో మాట్టాడుతూ బెంగాల్లో నన్పై జరిగిన లైంగికదాడిని ప్రస్తావించారు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తులు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇద్దరు ముస్లిం వ్యక్తులని చెప్పారు. దేశంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, అయితే, వీటికి పార్టీకి, పార్టీ సంస్థలకు, పార్టీ వ్యక్తులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తమ సిద్ధాంతాలు, తమ విధానాలు అనుసరించేవారు ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడరని, ప్రతి దానికి తమను నిందించడం అలవాటుగా మారిందన్నట్లు ఆయన చెప్పారు.

దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేతలు.. అత్యాచారానికి, మతానికి సంబంధం పెడుతూ వ్యాఖ్యలు చేయడమేమిటని గడ్కారీని తీవ్రంగా విమర్శించారు. బీజేపీ మతతత్వాన్ని ప్రోత్సహిస్తోందంటూ విపక్షాలు ఆక్రోశాన్ని వెళ్లగక్కాయి. కేంద్రమంత్రి అయ్యి ఉండి లైంగిక దాడిని మతంతో ముడిపెట్టడం సబబేనా అని ప్రశ్నించింది. ఎప్పటికీ అ రెండు విషయాలకు జతకట్టకూడదని పేర్కొంది. లైంగికదాడి అనేది మానసిక వైకల్యంతో కూడిన ఓ వ్యక్తి చేసే దుశ్చర్య అని, ఆ వ్యక్తిని శిక్షించాలే తప్ప ఇలా మతాల విషయాలు తెరమీదకు తీసుకురాకూడదని కాంగ్రెస్ నేతలు గడ్కారీకి సూచించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nitin Gadkari  goa congress  nun rape case  

Other Articles