IPL8 | match | Fixing |BCCI

Match fixing in indian premiur leauge 8 season

IPL, fixing, Indian premiur leauge-8 ,Rajasthan Royals, BCCI, anti-corruption

IPL match fixing in Indian premiur leauge-8 season?. A day before Rajasthan Royals plays its first match in this IPL, it has emerged that one of its players informed the BCCI’s anti-corruption team last month that he had been approached by a Ranji teammate with an offer of money if he followed a pre-decided pattern of play.

ఫిక్సింగ్ వివాదం.. ఐపిఎల్ 8 లో బుకీల హవా..? విచారణ ప్రారంభం

Posted: 04/10/2015 10:23 AM IST
Match fixing in indian premiur leauge 8 season

ఫిక్సింగ్.. ఆటలో ఎదుటి వ్యక్తిని గెలిపించేందుకు చేసే శ్రమను నాశనం చేసేది. ఫిక్సింగ్ పదం క్రికెట్ కు ఎంతో దగ్గరగా ఉంటుంది. గతంలోనూ క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ గురించి ఎన్నో సార్లు చూశాం. అయితే తాజాగా ఐపీఎల్ 8 లో మరోసారి ఫిక్సింగ్ కలకలం రేగింది.  రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిని ఓ బుకీ సంప్రదించి డబ్బులు ఇవ్వడానికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రాజస్థాన్ రాయల్స్- కింగ్స్ ఎలివన్ పంజాబ్ జట్ల మధ్య ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ జట్టుకు చెందిన ఆటగాడిని గత నెలలోనే బుకీ సంప్రదించి ఫిక్సింగ్ కు చేయడానికి యత్నించినట్లు తెలిసింది.
 
గతంలో ఐపిఎల్ 6 సీజన్ లోనూ రాజస్థాన్ రాయల్స్ టీం మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం పెద్ద దుమారాన్నే రేపింది. ఇండియన్ క్రికెట్ కు అది చెడ్డ పేరు తెచ్చింది. తాజాగా మరోసారి కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడం, ఏకంగా క్రికెటర్ బిసిసిఐకి ఫిర్యాదు చెయ్యడంతో సంచలనం రేగింది. మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా డబ్బులు ఆఫర్ చేశాడు ఓ బుకీ. అయితే ఆ డబ్బును తిరస్కరించిన సదరు ఆటగాడు ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక బృందం దృష్టికి తీసుకొచ్చాడు. దీనిపై ఆ క్రికెటర్ ను యాంటీ కరప్షన్ మరియు సెక్యూరిటీ యూనిట్ సభ్యులు విచారిస్తున్నారు. ప్రస్తుతం జరిగే ట్వంటీ 20 లీగ్ లో లేని ఆటగాడికి డబ్బులు ఇవ్వజూపడానే వార్తల పట్ల సర్వత్రా కలకలం చోటు చేసుకుంది. ఓ అజ్ఞాత వ్యక్తి ఫిక్సింగ్ కు తెరలేపడానికి యత్నించాడన్న వార్తలతో ఐపీఎల్ ఆటగాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే  డబ్బులను ఎవరు ఇవ్వాలని చూశారో ఇంకాల వెలుగులోకి రాలేదు. అయితే బిసిసిఐకి ఫిర్యాదు చేసిన రాజస్థాన్ రాయల్స్ ఆటగాడి పేరును కూడా బిసిసిఐ బయటిరి వెల్లడించలేదు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL  fixing  Indian premiur leauge-8  Rajasthan Royals  BCCI  anti-corruption  

Other Articles