Jagan | Rahuveerreddy | Devineni | Fire

Ap minister umamaheshwar rao fire on ysrcp leader jagan and pcc president raghuverareddy

ysrcp , jagan, pcc president, raghuverareddy, devineni, umamaheshwar rao, thief

ap minister umamaheshwar rao fire on ysrcp leader jagan and pcc president raghuverareddy. Ap minister devineni umamaheshwar rao said that ap pcc president and ysrcp leader jaganmohanreddy are thievs.

దొంగల్.. దొంగల్.. ఇద్దర్ దొంగల్

Posted: 04/10/2015 09:11 AM IST
Ap minister umamaheshwar rao fire on ysrcp leader jagan and pcc president raghuverareddy

రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన తల్లి కాంగ్రెస్‌.. దోచుకున్న పిల్ల కాంగ్రెస్‌లు పూటకోరకంగా మాట్లాడుతున్నాయని నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌లు ఇద్దరూ తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నారని, పగలు కాంగ్రెస్‌, రాత్రిళ్లు వైకాపాగా రూపాంతరం చెందుతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని దారుణంగా విడదీసిన కాంగ్రెస్‌ను ప్రజలు ఛీకొట్టినా బుద్ధిరాలేదన్నారు.కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి దాదాపు 16వేలకోట్ల లోటు బడ్జెట్‌ ఉన్నా, అభివృద్ది, సంక్షేమ పధకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్న ప్రభుత్వంపై, అధికార పార్టీపైనా వైయస్‌ఆర్‌ సిపి, కాంగ్రెస్‌ పార్టీల నేతలు కువిమర్శలు మానుకోవాలని మంత్రి దేవినేని హితవు పలికారు.

రైతు రుణమాఫీ అసాధ్యమని వైయస్‌ జగన్మోహనరెడ్డి ఎన్నికల ముందే చెప్పాడని, అయితే తమ ప్రభుత్వం రుణమాఫీని అమలుచేసి రుణమాఫీ సాధ్యమేనని నిరూపించిందన్నారు. గత ప్రభుత్వంలో పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావడానికి ధైర్యం చేసే పరిస్ధితి ఉండేదని, ప్రస్తుతం టిడిపి హయాంలో దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వని రాయితీలను ఇచ్చి పరిశ్రమలు స్ధాపిస్తామని, ముందుకొచ్చే వారికి 21 రోజుల్లో పూర్తి అనుమతులు ఇచ్చే అవకాశం మన ఒక్క రాష్ట్రంలోనే కనబడుతుందన్నారు. పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి పట్టిసం ప్రాజెక్టులో 500 కోట్లు అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారని, మరోపక్క ఇంకొక వైసిపిలో ఉన్న మాజీ మంత్రి కేంద్రం ఇచ్చిన నిధులలో అవినీతి జరిగిందని ఆరోపించడం వెనుక ఆ రెండు పార్టీల మ్యాచ్‌ ఫిక్చింగ్‌కు నిదర్శనమని ఆరోపించారు. పోలవరం స్పిల్‌వే పనులను నాలుగేళ్లపాటు అర్ధంతరంగా కమిషన్లకు కక్కుర్తిపడి వైఎస్‌ నిలిపివేశారని ఆరోపించారు. ప్రజాధనాన్ని, ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టిన జగన్‌ పట్టిసీమ టెండర్లలో తనకు ముడుపులు ముట్టాయని ఆరోపించటం సిగ్గుచేటన్నారు. దోచుకున్న డబ్బును పేదలకు పంచేందుకు బస్సుయాత్రలు నిర్వహిస్తే మంచిదని సలహా ఇచ్చారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ysrcp  jagan  pcc president  raghuverareddy  devineni  umamaheshwar rao  thief  

Other Articles