Trai Reduces Tariff Ceiling National Roaming Rates to Drop

Trai reduces tariff ceiling national roaming rates to drop

trai tarriff ceiling, mobile users, roaming rates, sms charges, trai official said, trai latest scheme, mobile charges rates, mobile rates

Trai Reduces Tariff Ceiling National Roaming Rates to Drop : Aiming to give some benefit to mobile phone subscribers, the telecom regulator has reduced tariff ceiling for national roaming calls and messages and has mandated telecom service providers (TSPs) to offer a special roaming tariff plan, an official said in New Delhi on Thursday.

మొబైల్ వినియోగదార్లకు శుభవార్త!

Posted: 04/09/2015 08:11 PM IST
Trai reduces tariff ceiling national roaming rates to drop

మొబైల్ వినియోగదార్లకు శుభవార్త! ఇకనుంచి జాతీయ రోమింగ్ కాల్స్, టెక్ట్స్ మెసేజెస్ ఛార్జీలు మరింత చౌక కానున్నట్లు సమాచారం! ఈ మేరకు వాటిపై సీలింగ్ టారిఫ్ లను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తగ్గించింది. అంతేకాదు.. ప్రత్యేక రోమింగ్ టారిఫ్ ప్లాన్ ను ఆఫర్ చేయబోతున్నట్లు ట్రాయ్ తెలిపింది.

ఈ క్రమంలో ట్రాయ్ తగ్గించిన సీలింగ్ టారిఫ్ వివరాలను గమనిస్తే.. ఇక నుంచి ఔట్ గోయింగ్ లోకల్ కాల్స్ కు నిముషానికి రూ.1 నుంచి 80 పైసలు.. ఎస్.టీ.డీ కాల్స్ కు నిముషానికి రూ.1.50 నుంచి 1.15కు తగ్గించింది. ఇక రోమింగ్ విషయంలో ఇన్ కమింగ్ కాల్స్ కు నిముషానికి 75 పైసలు నుంచి 45 పైసలు తగ్గించినట్లు తెలిపింది. అలాగే లోకల్ ఎస్ఎంఎస్ లకు రూ.1 నుంచి 25 పైసలు, ఎస్.టీ.డీ ఎస్ఎంఎస్ పంపితే రూ.1.50 నుంచి 38 పైసలుకు ఛార్జీలు తగ్గించినట్లు ట్రాయ్ విశ్లేషించింది. ఈ విధంగా తగ్గించిన టారిఫ్ వివరాలను ట్రాయ్ ఓ ప్రకటనలో తెలిపింది.

‘వినియోగదారులంతా తగ్గించిన సీలింగ్ ఛార్జీల ద్వారా ప్రయోజనం పొందుతారు’ అంటూ ట్రాయ్ ఆ ప్రకటనలో భాగంగా స్పష్టం చేసింది. ఈ కొత్త ఛార్జీలు మే 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మొత్తం వివరాలను పరిశీలిస్తే.. కొత్త ఛార్జీలతో కాల్ ఛార్జీలు 20 శాతం, మెసేజింగ్ రేట్లు 75 శాతం మేర పడిపోయాయి. వినియోగదారుల ప్రయోజనం కోసం నష్టాన్ని భరించేందుకు సంస్థలు సిద్ధమయ్యాయి. మరోవైపు.. ఛార్జీలు ఒకేసారి ఇంత చౌకగా తగ్గిపోవడంతో వినియోగదారులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trai tarriff ceiling  mobile charges rates  

Other Articles