Lunchmotion | Petetion | Highcourt

Lunch motion petetion on chittor smuglers encounter case

high court, petetion, lunch motion, chittur, thirupathi, ap, police

lunch motion petetion on chittor smuglers encounter case. IN ap cittur dist shashachalam forest police encounter 20 people who commnecing smuglling at forest.

కోర్టుకు చేరిన స్మగ్లర్ల ఎన్ కౌంటర్.. హైకోర్ట్ లో లంచ్ మోషన్ పిటిషన్

Posted: 04/08/2015 12:22 PM IST
Lunch motion petetion on chittor smuglers encounter case

తెలుగు రాష్ట్రాల్లో తుపాకుల మోత మోగింది. తెలంగాణలో వారం రోజుల నుండి సాగుతున్న బుల్లెట్ ల శబ్దం తారా స్థాయికి చేరింది. తెలంగాణలో వికారుద్దీన్ గ్యాంగ్, ఏపిలో ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్ కౌంటర్ లతో వాతావరణ: వేడెక్కింది. అయితే తాజాగా చిత్తూరు జిల్లాలో ఎన్కౌంటర్పై హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను న్యాయవాది రఘునాథ్ బుధవారం హైకోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కోర్టు మధ్యాహ్నం విచారణ చేపట్టనుంది. చిత్తూరు జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది ఎర్రచందనం కూలీలు మరణించిన సంగతి తెలిసిందే. కూలీలు మరణంపై సర్వత్రా విచారం వ్యక్తమవుతుంది.

మృతులంతా తమిళనాడుకు చెందిన వారే. ఈ నేపథ్యంలో కూలీల మృతిపై ఆ రాష్ట్రానికి చెందిన పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూలీల ఎన్కౌంటర్ మానవ హక్కులు ఉల్లంఘన అని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఇప్పటికే జాతీయ మానవ హక్కుల సంఘానికి లేఖ రాశారు. ఇప్పటికే కూలీలను కాల్చి వేసి, అసలు సూత్రధారులను వదిలేశారు అంటూ పోలీసులపై విమర్శలు వస్తున్నాయి. అయితే మానవ హక్కుల ఉల్లంఘన అంటూ తీవ్ర నిరసనలు వస్తున్న నేపథ్యంలో హైకోర్ట్ ఎలా స్పందిస్తుందో అని సర్వత్రా చర్చ మొదలైంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : high court  petetion  lunch motion  chittur  thirupathi  ap  police  

Other Articles