nara lokesh | america | social media | photos | viral

Nara lokesh photos hulchal in social media

nara lokesh photos hulchal in social media, nara lokesh photos goes viral in social media, nara lokesh updates, nara lokesh latest news, nara lokesh america photos, nara lokesh enjoying in america, nara lokesh with girl friends in america, nara lokesh latest updates

nara lokesh photos goes viral in social media

అమెరికాలో అబ్బాయిగారి సర(సా)దాలు..సోషల్ మీడియాలో హల్ చల్..

Posted: 04/08/2015 10:25 AM IST
Nara lokesh photos hulchal in social media

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. అప్పడప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై ట్విట్టర్ లో కారాలు మిరాయాలు నూరే ట్వట్టర్ పిట్ట.. అటు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుని, పార్టీలో కీలక బాధ్యతలను చేపట్టాలని అనుకుంటున్న తరుణంలో.. వాటికి అవరోధం కలిగించేలా సోషల్ మీడియాలో ఆయన హాట్ టాపిక్ గా మారారు. వేసవి సెలవులలో సరదాగా స్నేహితులతో కలసి వెళ్లారో ఏమో తెలియదు కానీ ఈ ఫోటోలను చూసిన తరువాత పాత సినిమాలో విలన్ల మాదిరిగా  ఏ ఫోటో చూసినా.. పక్కన అమ్మాయిలు మాత్రం ఉండాల్సిందే అనేలా ఫోటోలకు ఫోజులిచ్చారు చిన్నబాబు

సంబంధం లేకుండా మాట్లాడుతున్నారేంటి అనుకోబాకండి.. ఎందుకంటే ఇప్పడు ఆయన కన్నా ఆయన అమెరికాలోని స్నేహితులతో కలసి తిరిగిన సందర్భంలో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఎక్కడ చూసినా ఆ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. ఫేస్‌బుక్, వాట్సప్ వంటి సోషల్ మీడియాలో ఇప్పుడా ఫొటోల వీక్షకులు విపరీతంగా పెరిగిపోయారు. అమెరికా మిత్రబృందంతో కలసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో లోకేష్ జరిపిన విహారయాత్రకు సంబంధించిన ఆ ఫొటోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో దర్శనమీయడం చర్చనీయాంశంగా మారింది.

lokesh1
lokesh2
lokesh4
lokesh5

ఈ ఫొటోలు తొలుత ‘ఇండియా-అన్‌ అఫీషియల్. బ్లాక్‌స్పాట్ డాట్ ఇన్’ అన్న లింక్ ద్వారా సైట్‌లో వెలుగుచూడగా.. ఆ తర్వాత సోషల్ మీడియాలోకెక్కాయి. ఇప్పుడా లింక్‌ను వెబ్‌సైట్ నుంచి తొలగించినప్పటికీ సోషల్ మీడియాలో ఆ ఫొటోలు హల్‌చల్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీలో నిర్వహించనున్న తెలుగునాడులో పార్టీలో ప్రాముఖ్యత గల స్థానాన్ని అప్పగించాలని యోచిస్తున్న సమయంలో ఇలా ఫోటోలు బయటకు రావడం.. చర్చనీయాంశంగా మారాయి. ప్రతీ సమావేశంలో, సభలలో తమ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని గొంతోత్తి చెప్పి చంద్రబాబు, తన కుమారులుంగారి ఫోటోలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

ఇది ఇవాళ్లి యువతకు మామూలే.. ఇందులో తప్పేముంది అన్న వాదనలను కూడా పైకి తీసుకురావచ్చు. ఇక మరికోందరు టీడీపీ నేతలు మరో అడుగు ముందుకేసీ.. వాడు మగాడ్రా బుజ్జి అని కూడా అనోచ్చు. అయితే ఇవన్నీ.. సినిమాల్లో అయితే చప్పట్టు కోట్టి, ఈలలు వేసి సంతోషిస్తారేమోకానీ, నిజ జీవితంలో ఇలాంటి ఫోటోలు.. గట్రా దిగితే.. ప్రజలు ఎలా స్పందిస్తారో.. వేచి చూడాలి. ఇప్పటికే నారా లోకేష్ బాబుపై గతంలో కోన్ని అరోపణలు వచ్చిన విషయం కూడా తెలిసిందే. టీడీపీ ఎంపీ సీటు ఆశించి భంగపడి.. తన స్కాం బయటికి రావడంతో కోలా కృష్ణమోహన్ ఇలాంటి చౌకబారు అరోపణలు చేశారని అప్పట్లో టీడీపీ నేతలు వాటిని సమర్థవంతంగా తప్పికోట్టారు. అయితే ఈ ఫోటోలతో ఆ ఆరోపణలన్నీ కూడా నిజమని జనం నమ్మే ప్రమాదం లేకపోలేదు. ఏది ఏమైనా నారా లోకేష్ బాబు పర్సనల్ ఫోటోలను ఇలా బహిర్గత పర్చడం కూడా సమంజసం కాదన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nara lokesh  america  social media  photos  viral  

Other Articles