Secretariate | AP | Farmers

Farmers to andhra pradesh secretariate to issue loan weaver

ap, secretariate, chandrababu, crop loan, banks, farmers, kutumbarao

farmers to andhra pradesh secretariate to issue loan weaver. farmers request to crop lean weavers. some farmers to ap secretariate for the loans. kutumba rao took the letters from the farmers and promise them to solve their problems.

రుణ'మాఫీ' పై పొలోమంటూ సచివాలయానికి రైతులు

Posted: 04/06/2015 01:12 PM IST
Farmers to andhra pradesh secretariate to issue loan weaver

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రైతుల రుణ మాఫీ వ్యవహారం కొత్త తలనొప్పిని తీసుకురానుందా.. అప్పటి దాకా ఉన్న వివాదాలు సరి పోవడం లేదని మరొ సారి రైతులు చంద్రబాబు నాయుడుకు ఝలక్ ఇవ్వనున్నారా.. అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే తమకు రుణమాఫీ జరగలేదని ఏకంగా ఏపి సెక్రటేరియట్ కు వచ్చారు కొంతమంది రైతులు.

ఆంధ్రప్రదేశ్ సచివాలయం వద్ద రుణమాఫీ బాధితులు వచ్చారు. అన్ని అర్హత పత్రాలు ఉన్నా రుణమాఫీ వర్తించటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావును కలిసేందుకు  రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పొగాకు రైతులకు రుణమాఫీ ఇవ్వటం లేదని వారు వాపోయారు. బ్యాంకు పుస్తకాలు, ఆధార్ కార్డులు ఉన్నా రుణమాఫీ జాబితాలో తమను చేర్చలేదని ఫిర్యాదు ఈ సందర్భంగా కుటుంబరావుకు ఫిర్యాదు చేశారు. ఎమ్మార్వోలు, బ్యాంకు అధికారులు సమాధానం చెప్పటం లేదని రైతులు తెలిపారు. జిల్లా స్థాయిలో కూడా ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయలేదని రైతులు ఆవేదన చెందారు.  కాగా రెండోవిడత రుణమాఫీ అమలు విషయంలో అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200మంది రైతులు సచివాలయానికి వచ్చారు.

మొత్తానికి ఏపి ప్రభుత్వం చేస్తున్న రుణ మాఫీ తమకు అందడం లేదని వచ్చిన రైతుల వ్యవహారం ఇక్కడితో ఆగిపోతుందా అన్నది అనుమానమే. ఎందుకంటే సెక్రటేరియట్ కు వెళితే తమ రుణాలు మాఫీ అవుతాయని రైతులు గనక గట్టిగా విశ్వసిస్తే మాత్రం ఏపి సచివాలయానికి రైతులు పోటెత్తే అవకాశాలున్నాయి. తమ వినతులను పరిష్కరించాలని వారు చంద్రబాబు నాయుడుకు వినతుల మీద వినతులు పంపించవచ్చు. మరి ఈ వ్యవహారం ఎక్కడి దాకా వస్తుందో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap  secretariate  chandrababu  crop loan  banks  farmers  kutumbarao  

Other Articles