Amithsha | Rahul | BJP

Amitha sha suggest to search for rahul gandhi instead of finding faults in the nda government

amithsha, bjp, modi, nda, congress, rahulgandhi, meeting, bangaluru

BJP chief Amit Shah on Friday took a dig at Congress and asked the opposition party to search for Rahul Gandhi instead of finding faults in the NDA government.

తప్పులు కాదు, రాహుల్ గాంధీని వెతకండి: అమిత్ షా

Posted: 04/03/2015 03:37 PM IST
Amitha sha suggest to search for rahul gandhi instead of finding faults in the nda government

బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కాంగ్రెస్ పై విమర్శనాస్ర్తాలు గుప్పించారు. ఎన్డీయే తప్పులను వెతకడం కాదు ముందు మీ నాయకుడిని వెతకండి అని అమిత్ షా కాస్త ఘాటుగానే మండిపడ్డారు. బిజెపి చేస్తున్న ప్రతి పనికి కాంగ్రెస్ అడ్డుకట్టగా నిలుస్తోందని అన్నారు. విజయం రాగానే పొంగిపోయి, వైఫల్యం రాగానే కుంగిపోకూడదని కార్యకర్తలకు సూచించారు. రానున్న మరో పది లేదా ఇరవై సంవత్సరాల వరకు కూడా బిజెపి అధికారంలో ఉండవచ్చు అని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు.  భూసేకరణ బిల్లుకు మద్దుతుగా అన్ని రాష్ట్రాల్లో మే 6వ తేది నుండి ర్యాలీలు నిర్వహించాలని కూడా పార్టీ నిర్ణయం తీసుకుంది.

ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా నమోదైన తరువాత బిజెపి పార్టీ జాతీయ సమావేశం మొదటిది కావడంతో అందరూ కాస్త ఉత్సాహంగా ఉన్నారు. పది నెలల పాటు ఎలాంటి అవినీతికి తావు లేకుండా పాలనను అందిస్తున్నందుకు మోదీ ప్రభుత్వానికి అమిత్ షా అబినందనలు తెలిపారు. మరోపక్క భూసేకరణ బిల్లు ప్రధాన అజెండాగా సాగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశంలో బిల్లును ఎలా చట్టంలా మార్చాలని సమాలోచనలు జరిపింది. తమ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని బిజెపి సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. మొత్తానికి కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టి ఎలాగైనా భూసేకరణ బిల్లును ఆమోదముద్ర వేయించుకోవాలని బిజెపి పార్టీ నిర్ణయం తీసుకుంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amithsha  bjp  modi  nda  congress  rahulgandhi  meeting  bangaluru  

Other Articles